వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలిన ఎస్ఆర్-20 విమానం: నలుగురి మృతి

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: విమానం కూలి నలుగురు మృతిచెందిన ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్‌ అక్తర్‌కి చెందిన ఎస్‌ఆర్‌-20 అనే సింగిల్‌ ఇంజిన్‌ విమానం హ్యూస్టన్‌లోని డేవిడ్‌ వేన్‌ హుక్స్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరి నవాసోటా ప్రాంతంలో కూలిపోయింది.

ఈ విమానంలోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్‌ఏఏ(ఫెడరల్‌ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌) అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

4 dead in Navasota plane crash

బాగ్దాద్ మార్కెట్‌లో ఆత్మాహుతి దాడి

బాగ్దాద్: ఇరాక్‌లో ఉగ్రవాదులు ఆదివారం వేర్వేరుచోట్ల బాంబుదాడులకు దిగారు. తూర్పు బాగ్దాద్‌లోని బహిరంగ మార్కెట్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 38 మంది మృతిచెందగా 62 మంది గాయపడ్డారు.

సదర్‌నగర పరిధిలోని షియాలు అధికంగా ఉండే మ్రేది మార్కెట్‌లో రద్దీగా ఉన్న ప్రాంతంలో ఆత్మాహుతి సభ్యుడు తననుతాను పేల్చుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ పేర్కొంది.

English summary
Four people, including two children, were killed in a plane crash near the Navasota Municipal Airport on Sunday morning, Grimes County Sheriff Donald Sowell confirmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X