పెన్సిల్వేనియా కారువాష్ వద్ద కాల్పులు: నలుగురు మృతి
పెన్సిల్వేనియా: పెన్సిల్వేనియా కారు వాష్ వద్ద జరిగిన కాల్పులు నలుగురు వ్యక్తులు మరణించారు. ఆదివారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
నలుగురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మరణించినట్లు అధికారులు వెల్లడించారు. కాల్పులు జరిగిన దుండగుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మృతులంతా 20, 30 ఏళ్ల మధ్య వయస్సు గలవారే.

ఈ సంఘటనలో ఐదుగురు మరణించినట్లు తొలుత పోలీసులు ప్రకటించారు. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి మరణించాడా, లేదా అనేది వెంటనే తెలియలేదు.
కాల్పులకు గల కారణాలు తెలియలేదు. డ్రగ్స్ యాక్టివటీ గురించి ఇప్పుడే చెప్పలేమని పోలీసులు అంటున్నారు. మృతుల్లో ఇద్దరు ్రన్ పికప్ ట్రక్‌లో కనిపించగా, మరో ఇద్దరు కారు వాష్ పార్కింగ్ లాట్ వద్ద కనిపించారు.
కుటుంబ కలహాలు దీనికి కారణమై ఉండవచ్చునని ఓ పత్రిక రాసింది. కారు వాష్ 24 గంటలు పనిచేస్తూ ఉంటుంది. అయితే, సంఘటన జరిగిన రోజు ఉద్యోగులెవరూ లేరు.












Click it and Unblock the Notifications