ఊపిరాడక పడవలోని 40 మంది మృతి

రోమ్: మధ్యధరా సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పడవ ప్రమాదంలో 40 మంది వలసవాదులు మృత్యువాత పడ్డారు. ఇటలీ నుంచి యూరప్‌కు వెళ్తున్న పడవ అడుగు భాగంలోని గదిలో ఊపిరి ఆడకపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఇటలీ నావికాదళ అధికారులు పేర్కొన్నారు.

సంఘటనా సమయంలో పడవలో 300 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. పరిమితికి మించి ప్రయాణికులున్న పడవ మునిగిపోతుండటాన్ని ఇటలీకి చెందిన నేవీ హెలికాప్టర్‌లో ఉన్న అధికారులు గుర్తించారు.

40 migrants die off Italy as EU faces 'worst crisis since WWII'

వెంటనే వారు సహాయక చర్యలు చేపట్టారని ఇటలీ టెలివిజన్ ఛానెల్ రాయ్‌న్యూస్ తెలిపింది.40మంది పడవ ప్రమాదంలో చనిపోగా, మిగితా వారిని రక్షించారు.

లిబియా నుంచి దాటించేందుకు తక్కువ ఛార్జీలు చెల్లించే నల్లజాతీయులు, వలసవాదులను రవాణాదారులు పరిమితికి మించి పడవల్లో కుక్కి తాళం వేస్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రమాదం జగరడం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+