వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శవాల పూడ్చివేత: ఇంట్లో బయటపడిన 400 అస్తిపంజరాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

లండన్: ఒక ఇంట్లో 400 మానవ కంకాళాలు బయటపడ్డాయి. ఇంట్లో శవాలు ఉన్నాయంటే భీతిల్లే స్థితిలో ఒక ఇంట్లో 400 మందిని పాతిపెట్టారంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అటువంటి గృహాన్ని బ్రిటన్ పురావస్తుశాఖ వెలికితీసింది. పైగా అస్తి పంజరాలపై పరిశోధనలు కూడా చేస్తోంది.

బ్రిటన్‌‌‌‌‌‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన సెయింట్ జాన్స్ కాలేజీ భవనానికి ఈ భవనానికి మరమ్మతులు చేపట్టారు. ఈ తవ్వకాల్లో భారీఎత్తున అస్థిపంజరాలు బయట పడ్డాయి. దీంతో పురావస్తు శాఖ రంగంలోకి దిగింది. అస్థిపంజరాలు కాదు ఏకంగా శ్మశానమే ఉందని తెలుసుకుని విస్తుపోయారు.

400 complete human skeletons discovered beneath St John's College, Cambridge

దాదాపు 400 అస్థిపంజరాలు చెక్కుచెదరకుండా ఉండగా, మరిన్ని అస్తిపంజరాలు ఏ భాగానికా భాగం వేరైపోయి ఎముకలే కనిపించాయి. సుమారు మూడేళ్ళ క్రితం ఈ పరిశోధనలు జరిగినా దాన్ని దాచిపెట్టారు. తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టారు. బహుశా మధ్యయుగం నాటి శ్మశానాలతో ఈ ప్రాంతాన్ని పోల్చవచ్చునని వాళ్ళు అంటున్నారు.

అస్తిపంజరాలకు డీఎన్ఏ పరీక్షల ద్వారా వాటి కాలాన్ని తెలుసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక్కడ 1511 ప్రాంతంలో ఇక్కడ ఓ ఆసుపత్రి ఉండేదని తెలుస్తోంది. అందులోని రోగులు మరణించినప్పుడు వారి శవాలను ఆసుపత్రి కిందే ఖననం చేసినట్టు ఉందని అనుకుంటున్నారు.

English summary
The bones of more than 1,300 people have been discovered deep underneath St John's College, in one of the largest finds of its kind in British history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X