వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Danger Bells:కొత్త రకం జబ్బుతో చింపాజీలు మృతి-మానవాళిని మరో మహమ్మారి కబళిస్తుందా..?

|
Google Oneindia TeluguNews

ప్రపంచ మానవాళిని గడగడలాడించేందుకు మరో మహమ్మారి వస్తోందా.. ఇప్పటి వరకు కరోనాతో కకావికలమైన ప్రపంచ దేశాలు మరో సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా జరిగిన పరిశోధనల్లో మనిషి రూపాన్ని పోలిఉంటే చింపాజీలు ఈ కొత్త వ్యాధితో మృతి చెందాయి. దీంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చింపాజీల్లో కొత్త రకం బ్యాక్టీరియా

చింపాజీల్లో కొత్త రకం బ్యాక్టీరియా

పశ్చిమ ఆఫ్రికాలోని సియార లియోన్ దేశంలోని టాకుగామ శాంక్చురీలో కొత్త రకం బ్యాక్టీరియా సోకి అనుమానాస్పద రీతిలో కొన్ని చింపాజీలు మృతి చెందాయి. అయితే ఇవి ముందుగా అనారోగ్యంకు గురై ఆ తర్వాత ఆరోగ్యం క్రమంగా క్షీణించి మృతి చెందినట్లు పరిశోధకులు చెబుతున్నారు. చింపాజీలు 98శాతం మానవ జన్యుక్రమం కలిగి ఉన్నందున మనిషి ప్రాణాలకు కూడా ఈ బ్యాక్టీరియా పెద్ద ప్రమాదంగానే పరిణమిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

బ్యాక్టీరియం బారిన పడి 56 చింపాజీలు మృతి

బ్యాక్టీరియం బారిన పడి 56 చింపాజీలు మృతి


ఎపిజూటిక్ న్యూరాలజిక్ అండ్ గాస్ట్రోఎన్‌ట్రిక్ సిండ్రోమ్ (ENGS)గా ఈ బ్యాక్టీరియాను గుర్తించారు.దీని బారిన పడిన చింపాజీలకు నరాల సంబంధిత సమస్యలు, వాంతులు, డయేరియా సోకి మృతి చెందినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. 2005 నుంచి ఇప్పటి వరకు ENGS బ్యాక్టీరియం బారిన పడి 56 చింపాజీలు మృతి చెందాయి. వీటికి చికిత్స అందించినప్పటికీ ఫలితం దక్కలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ పరిశోధకుల బృందం ENGS బ్యాక్టీరియంను అధ్యయనం చేసి ఇది సర్సినా సంక్రమణతో సంబంధం కలిగి ఉందని వెల్లడించారు. ఇది అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

మృతి చెందక ముందు చింపాజీల పరిస్థితి

మృతి చెందక ముందు చింపాజీల పరిస్థితి

2013 పబ్లికేషన్ ప్రకారం సర్సినా బ్యాక్టీరియం సోకితే గ్యాస్ట్రిక్ అల్సర్,ఎంఫిసెమాటస్ గ్యాస్ట్రిట్స్‌ వ్యాధి వస్తుందని తెలుస్తోంది.గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ బ్యాక్టీరియం సోకితే కడుపులో ప్రమాదంగా మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇక ఈ చింపాజీలు మృతి చెందక ముందు కడుపు సంబంధిత వ్యాధితో చాలా బాధపడ్డాయని చెబుతున్నారు. 33.7 శాతంగా ఉన్న చింపాజీల్లో దాదాపు 63.6శాతం చింపాజీలు ENGS వ్యాధితో మరణించాయి. మార్చిలో ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

English summary
West Africa, Chimpanzees die due to new bacterium, what is the new bacterium that killed Chimpanzees, Chimpanzees died in Sierr Leone, ENGS bacterium, ENGS Bacterium can effect neurological system,What is the potential risk involved with ENGS, latest news on Chimpanzees,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X