జపాన్ హిరారాలో 6.3 తీవ్రతతో భూకంపం: పరుగులు తీసిన జనం
టోక్యో: జపాన్ దేశంలోని హిరారాలో సోమవారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ధృవీకరించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు తమ నివాసాల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.
ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందనే విషయాలు తెలియరాలేదు. జపాన్ తోపాటు ఈ భూకంపం తైవాన్, చైనాలోని పలు ప్రాంతాల్లో కూడా సంభించిందని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

కాగా, సెప్టెంబర్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా రాజధాని ప్రాంతంలో కల్పిత భూకంపం ఆధారంగా టెలివిజన్ చేసిన విపత్తు డ్రిల్‌ను ప్రదర్శించారు. ఎందుకంటే అక్కడ 1,00,000 కంటే ఎక్కువ మంది 1923 సంభవించిన పెను భూకంపంలో మరణించారు.
సెప్టెంబర్ 1, 1923న టోక్యోకు నైరుతి దిశలో సాగమిహారా ప్రాంతంలో 7.9-తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. కేవలం కొద్ది నిమిషాల్లోనే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇది ఇలా ఉండగా, ఇటీవల మొరాకాలో సంభవించిన పెను భూకంపం కారణంగా 2వేలకు మందిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తీవ్రగాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంతకుముందు టర్కీలోనూ పెను భూకంపం సంభించి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి
కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి చెందిన ఘటన కాంగోలో చోటు చేసుకుంది. భారీ వర్షాల ధాటికి ఒక్కసారిగా విరిగిపడ్డ కొండచరియలు.. కొండ కింది ప్రాంతాల్లో ఉన్న నివాస గృహాలను కప్పేశాయి. దీంతో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి.
వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు. వాయువ్య మంగల ప్రావిన్స్‌లోని లిసాల్ పట్టణంలో.. కాంగో నది తీరప్రాంత పరిసరాల్లో ఈ ఘటన జరిగింది.












Click it and Unblock the Notifications