ఇండోనేషియాలో భూకంపం: సునామీ హెచ్చరిక ఉపసంహరణ
జకార్తా: తూర్పు ఇండోనేషియాను భూకంపం తాకింది. భూకంప తీవ్ర రెక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. సోమవారం తెల్లవారు జామున వచ్చిన ఈ భూకంపంతో తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత వెంటనే ఉపసంహరించుకున్నారు.
బాండా సముద్రంలోన 171 కిలోమీటర్ల లోతులో భూమి ఉపరితలంపై ఈ భూకంపం వచ్చినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. తొలుత ఇండియన్ ఓసియన్ సునామీ వార్నింగ్, మిటిగేషన్ సిస్టమ్ తొలుత సునామీ హెచ్చరికను జారీ చేసింది.

హిందూ మహాసముద్రానికి సంబంధించిన దేశాలకు ప్రమాదం లేదని ఓటిడబ్ల్యుఎంఎస్ రెండో బులిటెన్‌లో తెలిపింది.
ఇటువంటి భూకంపమే ఫిబ్రవరి 26వ తేదీన వచ్చింది. అయితే నష్టమేమీ జరగలేదు. ఇండోనేషియా సీస్మిక్ యాక్టివిటీ హాట్‌స్పాట్ అే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌పై ఉంది. దానివల్ల ఇండోనేసియాలో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి. వాటిలో చాలా వరకు ప్రమాదరహితమైనవే.












Click it and Unblock the Notifications