ఈక్వెడార్‌లో భారీ భూకంపం: కూలిన భవనాలు, 14 మంది మృతి, 380 మందికిపైగా గాయాలు
దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్, ఉత్తర పెరూ తీర ప్రాంతాన్ని శనివారం భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంపం కారణంగా కనీసం 14 మంది మరణించారు.
వాషింగ్టన్: దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్, ఉత్తర పెరూ తీర ప్రాంతాన్ని శనివారం భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంపం కారణంగా కనీసం 14 మంది మరణించారు. ఈ భూకంపంతో పలు ప్రాంతాల్లో భవనాలు, పాఠశాలలు, వైద్య కేంద్రాలకు భారీ నష్టాన్ని కలిగించిందని అధికారులు తెలిపారు.
యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) 6.8 తీవ్రతతో ఈ భూకంపం గుయాస్ ప్రావిన్స్‌లోని బాలావో నగరానికి 10 కిమీ (6.2 మైళ్లు) దూరంలో 66.4 కిమీ (41.3 మైళ్లు) లోతులో తాకింది.

ఈక్వెడార్ అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ఉదయం భూకంపం వల్ల సంభవించిన నష్టాన్ని ధృవీకరిస్తున్నట్లు తెలిపారు. భూకంపం బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. తాను కూడా ఇక్కడే ఉన్నానని చెప్పారు.
భూకంపం కారణంగా ఎల్ ఓరో ప్రావిన్స్‌లో 14 మంది మరణించారని, 380 మందికి పైగా గాయపడ్డారని ప్రెసిడెన్సీ కమ్యూనికేషన్ ఏజెన్సీ తెలిపింది. కనీసం 44 ఇళ్లు ధ్వంసమయ్యాయి, మరో 90 ఇళ్లు దెబ్బతిన్నాయని పేర్కొంది.
A magnitude 6.9 earthquake hit Ecuador 🇪🇨 right now. pic.twitter.com/1ZZ2VtJWPQ
— Truthseeker (@Xx17965797N) March 18, 2023
దాదాపు 50 విద్యా భవనాలు, 30 కంటే ఎక్కువ ఆరోగ్య కేంద్రాలు కూడా ప్రభావితమయ్యాయి. భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో చాలా రహదారులు మూసుకుపోయాయి. శాంటా రోసా విమానాశ్రయానికి స్వల్ప నష్టం వాటిల్లింది.
⚡️Destruction in Ecuador after 6.9M earthquake. pic.twitter.com/GQQ20dsjsb
— War Monitor (@WarMonitors) March 18, 2023
ఒక్కసారిగా భూకంపం సంభవంచడంతో నివాసాల్లోని ప్రజలు బయటికి పరుగులు తీశారు. భారీ భూకంపం తర్వాత మరో రెండు సార్లు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని స్థానికులు తెలిపారు. మరోవైపు, దేశంలోని ఉత్తర ప్రాంతంలో భూకంపం సంభవించిందని, అయితే ప్రజలకు లేదా నిర్మాణాలకు హాని జరిగినట్లు తక్షణ నివేదికలు లేవని పెరూ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications