సులావసీ ద్వీపంలో 6.8 తీవ్రతతో భూకంపం
జకార్తా : ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. సులావసీ ద్వీపంలో శుక్రవారం భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా రికార్డైంది. భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఇండోనేషియా అధికార వర్గాలు పేర్కొన్నాయి.
6.8 తీవ్రతతో ప్రకంపనాలు
ఇండోనేషియా, అక్కడి ద్వీపాల్లో భూమి సాధారణంగా కంపిస్తోంది. అయితే 6.8 అంటే భూకంప తీవ్రత ఎక్కువ అని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియలేదని పేర్కొన్నారు. ఈ భూకంపంతో సునామీ వచ్చే అవకాశం లేదని అమెరికా జియాలాజికల్ సర్వే నిపుణులు స్పష్టంచేశారు.













Click it and Unblock the Notifications