భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌లో భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9 గా నమోదు అయ్యిందని ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది. క్యుషు ద్వీపంలోని మియాజాకి ప్రాంతంలో 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే మియాజాకితోపాటు కొచీ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.ఈ భూకంపం దాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూ ప్రకంపనలకు భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీశారు.జపాన్ కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి 9.19 గంటలకు భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది.

నైరుతి ద్వీపం క్యుషు, దాని సమీపంలోని కొచ్చి ప్రిఫెక్చర్‌లో ప్రకంపనలు సంభవించాయి. ఎంతమేరకు నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. భూకంప కేంద్రం సముద్రంలో 48 కిలోమీటర్లు లోతులో కేంద్రీకృతం అయినట్లు సునామీ హెచ్చరికలు జారీ చేసింది జపాన్ వాతారణ శాఖ తెలిపింది. గతేడాది ఇదే చోట రెండు సార్లు భూకంపం సంభవించినా ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications