Online Game: ఆన్‍లైన్ గేమ్ ఆడి రూ.15 లక్షలు పోగొట్టుకున్న బాలిక..
తల్లిదండ్రులు డబ్బు, ఆస్తులు సంపాదించడమే కాదు.. పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలి. చాలా మంది తల్లిదండ్రలు సంపాదనపై దృష్టి పెట్టి పిల్లలను పట్టించుకోరు. దీంతో పిల్లలు ఒంటరిగా ఫీలవుతుంటారు. ఇలా కొందరు డ్రగ్స్ కు, కొందరు మద్యానికి, కొందరు ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలవుతుంటారు. ముఖ్యంగా ఈ మధ్య పిల్లలు ఆన్ లైన్ గేమ్స్ కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. కొందరైతే ప్రాణాలు తీసుకునే స్టేజికి చేరుతున్నారు.
చాలా మంది పిల్లిలు ఆన్ లైన్ గేమ్ ల్లో డబ్బులు పోగొట్టుకున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేసిన వారూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓ తండ్రి తన భూమి అమ్మగా వచ్చిన డబ్బులను కొడుకు ఖాతాలో వేశాడు. అతను ఆన్ గేమ్ ఆడి ఆ డబ్బంతా పోగొట్టాడు. తాజాగా 13 ఏళ్ల బాలిక ఆన్ గేమ్ లకు బానిసై లక్షల్లో డబ్బు పోగొట్టుకుంది. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న 13 ఏళ్ల బాలిక మొబైల్ గేమ్‌లు ఎక్కువగా ఆడేది.

పాఠశాలకు వెళ్లినా అక్కడ స్నేహితులతో ఆడుకోకుండా ఒంటరిగా మొబైల్ లో గేమ్ లు ఆడేది. ఇది గమమించిన టీచర్ బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. దీంతో తల్లి తన ఖాతాలో డబ్బులు చెక్ చేయగా.. భారీగా డబ్బు పోయినట్లు గుర్తించింది. బాలిక్ పే టు ప్లే గేమ్లకు అలవాటు పడి భారీగా డబ్బులు ఖర్చు చేసిందని బ్యాంక్ స్టేట్ మెంట్ ను బడ్డి అర్థమైంది. దీంతో తండ్రి బాలికను మందలించాడు.
డబ్బు ఎలా ఖర్చుపెట్టావో అడగ్గా.. గేమ్ కొనుగోలుకు రూ.15 లక్షలు తల్లి అకౌంట్ లోంచి తీసినట్లు ఒప్పుకుంది. అత్యవసర సమయంలో ఉపయోగించుకోవడం కోసం తనకు తన తల్లి డెబిట్ కార్డు పిన్ నెంబర్ చెప్పిందని బాలిక వివరించింది. ఆ బాలిక తన స్నేహితులక కోసం కూడా గేమ్‌లను కొనుగోలు చేసింది. చివరికి తల్లదండ్రులు బాలికను మానసిక చికిత్స ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లారు. అయితే బాలిక్ ఆన్ లైన్ గేమ్ ల కోసం రూ.15 లక్షలు పోగొట్టుకోవడం స్థానికంగా వైరల్ అయింది.












Click it and Unblock the Notifications