వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎముకలు విరుగుతున్నా 13 ఏళ్ళ బాలుడు రూ.50 లక్షల డాలర్లు సంపాదించాడు, ఎలా?

అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన స్పార్ట్ షా అనే 13 ఏళ్ళబాలడు ఇప్పుడు సంచనాలకు కేంద్రంగా మారాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ బాలుడి మాటలు, పాటలే విన్పిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన స్పార్ట్ షా అనే 13 ఏళ్ళబాలడు ఇప్పుడు సంచనాలకు కేంద్రంగా మారాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ బాలుడి మాటలు, పాటలే విన్పిస్తున్నాయి.

ఈ బాలుడికి ఇప్పటికే శరీరంలో 35 చోట్ల ఎముకలు విరిగాయి. పుట్టుకతోనే ఆ బాలుడికి శరీరంలో 35 చోట్ల ఎముకలు విరిగాయి. అయితే అతడి వయస్సు పెరుగుతున్నకొద్దీ శరీరంలో ఎముకలు విరుగుతూనే ఉన్నాయి.

శరీరంలో ఇప్పటికే 140 చోట్ల ఎముకలు విరిగాయి. ఆప్టియోజెనెసిస్ ఇంపర్ ఫెక్టా అనే అరుదైన జబ్బుతో ఈ బాలుడు జన్మించాడు. ఈ బాలుడి శరీరంలో రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని ఎముకలు విరుగుతాయో అర్థంకాదని వైద్యులు చెబుతున్నారు.

A 13-year-old wheelchair-bound musical prodigy of Indian origin is a motivational star

స్పార్ట్ ను చూసి ప్రపంచంలో ఎవరూ జాలిపడరు. అయ్యో పాపం అనరు. బాలుడి మాటలకు ఉత్తేజితులౌతారు. ప్రతి జీవితానికి ఓ ఆశయమనేది ఉండాలంటాడు బాలుడు. ఇప్పటికీ భారతీయ అమెరకా సంగీతరీతులను అవపోషణ పట్టిన ఈ బాలుడు సంగీత ప్రపంచం కోసం తన పేరును ప్యూర్ ప్లస్ రిథమ్ ను కలిసి ప్యూరిథమ్ గా మార్చుకొన్నాడు.

నాట్ అప్రైడ్ అంటూ 2016 జనవరిలో ఈ బాలుడు విడుదల చేసిన వీడియో ఆల్బమ్ వైరల్ అయింది. దాదాపు 6 కోట్ల మంది ఈ ఆల్బమ్ ను వీక్షించారు. రాగర్యాప్ అంటూ సరికొత్తబాణిని సృష్టించాడు. ఇప్పటివరకు అనేక సంగీత కచేరీలు నిర్వహించాడు.

అంతేకాదు ఇప్పటికే సంగీతకచేరీల ద్వారా 50 లక్షల డాలర్లను సంపాదించాడు. ఈ డబ్బుతో వైద్యం చేయించుకొంటున్నాడు. సంగీత సాధన చేస్తున్నాడు. గత డిసెంబర్ లో ముంబాయికి వచ్చిన ఓ టీవీ టాక్ షో లో పాల్గొన్న ఈ బాలుడు ప్రపంచంలోనే సాధించలేనిదంటూ ఏదీ ఉండదంటాడు.

కాకపోతే అదిసాధించేందకు కావాల్సినంత తపన, సాధన ఉండాలంటున్నాడు. వెరీ సింపుల్ గా సాధించవచ్చంటాడు. 11 అక్షరాలతో ఉండే కొన్ని సంక్లిప్త ఆంగ్లపదబందాలను చదివినప్పుడు అమ్మో వాటిని గుర్తుపెట్టుకోవడం ఎంత కష్టమో అనుకొన్నాను. ఆ మాటకొస్తే నా ఆరోగ్యపరిస్థితి క్లిష్టమైందన్నారు. ఆ తర్వాత ఆ పద పందాలన్నీ నాకు చాలా సులువైందన్నారు.

తనకు గ్రామీ అవార్డులు అక్కర్లేదన్నారు. తన పాటను ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వినాలన్నేది తన ఆశ అన్నారు. కనీసం వందకోట్ల మంది ప్రేక్షకుల ముందు ఓసారి ప్రదర్శన ఇవ్వాలనేది నా కోరిక అన్నారు.ఇదేమీ సాద్యంకాదన్నారు. సందేహం నాకేమీ లేదన్నారు. ఏదోరోజుసాధిస్తానన్న సంపూర్ణ విశ్వాసంతోనే ముందుకు పోతోన్నా సాధించి తీరుతాంటున్నాడు ప్యూరిథమ్.

కాళ్ళ నుండి నడుమువరకు కదలకపోయినా, శరీరంలో ఎముకలు విరిగిపడుతున్నా అధైర్యపడకుండా పాటేల తన జీవితంగా అభిరుచిని పెంచుకొపి పాటల ప్రపంచంలో లీనమౌతున్నారు.

English summary
Sparsh Shah was born with 40 fractures. He has till now had about 130 fractures, due to a rare condition called Osteogenesis Imperfecta, which makes his bones extremely brittle. Yet, the teenager has become a world-wide inspiration, and a musical phenomenon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X