వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై 26/11 దాడులు: పాక్ నుంచి నగదు బదిలి

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: ముంబై లో 2008 నవంబర్ 26న జరిగిన మారణహోమానికి పాక్ భారీ మొత్తంలో నగదు బదిలి చేసిందని వెలుగు చూసింది. ఓ బ్యాంకు ఉద్యోగి పాకిస్థాన్ నుంచి భారత్ కు భారీ మొత్తంలో నగదు బదిలి అయ్యిందని నిరూపించడానికి అవసరమైన ఆధారాలను పాక్ ప్రత్యేక కోర్టు ముందు పెట్టాడు.

ఆ నగదుతోనే 26/11 మారణహోమం జరిగిందని అంటున్నారు. ముంబై మారణహోమం జరగడానికి కొద్ది రోజుల ముందు ఈ కేసులోని ఓ ప్రధాన నిందితుడి ఖాతాలో నుంచి భారీ మొత్తంలో నగదు బదిలి చేశామని బ్యాంకు ఉద్యోగి బుధవారం కోర్టు ముందు సాక్ష్యం చెప్పాడు.

ముంబై 26/11 దాడుల కేసు విచారణ పాకిస్థాన్ లోని రావల్పిండిలోని ఆడియాల జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మద్య జరుగుతున్నది. ఈ కేసుకు సంబంధించి సాక్షులు పాకిస్థాన్ ఏటీసీ కోర్టు ముందు సాక్ష్యం చెబుతున్నారు.

A banker told a Pakistani anti- terrorism court holding the trial

ముంబై మారణహోమం కేసులో పాక్ చెందిన మాస్టర్ మైండ్ లఖ్వీ, ఆపరేషన్ కమాండర్ జకి-ఉర్- రెహమాన్ లఖ్వీ, అబ్దుల్ వాజీద్, మజర్ ఇక్బాల్, సాధిక్, సాహిద్ జమీల్, జమీల్ అహమ్మద్, యూనస్ అంజుమ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు.

2009లో పాక్ అధికారులు వీరిని అరెస్టు చేశారు. ఈ కేసులోని నిందితుడు సాహిద్ జమీల్ అకౌంట్ నుంచి భారత్ కు భారీ మొత్తంలో నగదు బదిలి అయ్యిందని బ్యాంకు ఉద్యోగి రికార్డులతో సహా కోర్టు ముందు పెట్టాడు. పాక్ ఏటీసీ కోర్టు ఈ కేసును నవంబర్ 4వ తేదికి వాయిదా వేసింది.

English summary
Mumbai attack mastermind Lakhvi and LeT operations commander Zaki-ur Rehman Lakhvi, Abdul Wajid, Mazhar Iqbal, Sadiq, Shahid Jamil, Jamil Ahmed and Younas Anjum were arrested in 2009 in Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X