ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి- అధికారులు మృతి: విజువల్స్ బీభత్సం
Balochistan: పాకిస్తాన్.. రక్తమోడింది. ఇన్నేళ్లు పెంచి పోషించిన ఉగ్రవాదానికి స్వయానా బలి అవుతోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి, దివాళా తీయడానికి సిద్ధంగా ఉన్న ఆ దేశంలో ఊపిరిపోసుకుంటోంది.. బలూచిస్తాన్ వేర్పాటువాదం. మొన్నటికి మొన్న ఏకంగా ఓ ఎక్స్‌ప్రెస్‌నే హైజాక్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇప్పుడు తాజాగా మరోసారి పంజా విసిరినట్టే కనిపిస్తోంది.
బలూచిస్తాన్‌లో తాజాగా మరో భారీ పేలుడు సంభవించింది. ఆర్మీ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనలో అయిదుమంది పాకిస్తాన్ ఆర్మీ అధికారులు మరణించారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

బలూచిస్తాన్‌లోని నౌష్కీ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఈ ఘటనకు తాము బాధ్యత వహిస్తోన్నామంటూ ఎవరూ ప్రకటించలేదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడిగానే దీన్ని భావిస్తోన్నారు. ఈ ఆర్మీకి చెందిన ఆత్మాహూతి దళ విభాగం ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని అనుమానిస్తోన్నారు.
బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టి ఈ ఘటనపై స్పందించారు. దీనిపై సమగ్ర పోలీసు విచారణకు ఆదేశించారు. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించామని, ప్రాణనష్టాన్ని నివారించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు.
MORE VISUAL #Nushki suicide attack: 90 army personnel killed - BLA #PakistanArmy #Balochistan https://t.co/Cb2RiJS6h2 pic.twitter.com/I76abKhe4O
— Indian Observer (@ag_Journalist) March 16, 2025
ఇటీవలే ఇదే బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను లిబరల్ ఆర్మీ హైజాక్ చేసిన విషయం తెలిసిందే. దీని తరువాత అనూహ్య పరిణామాలు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సైన్యం మొత్తాన్నీ ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. హైఅలర్ట్ ప్రకటించింది. అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోయాయి.
CCTV has captured the massive blast 💥
— Sanjana Singh (@RSSinsider3632) March 16, 2025
It’s seems #BLA claim about 90 Casualties are true. #PakistanArmy https://t.co/bhBAE98pYx pic.twitter.com/ybjK1vTgZI
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి గట్టి పట్టు ఉన్న ప్రావిన్స్ ఇది. మజీద్ బ్రిగేడ్, ఎస్టీఓఎస్, ఫతా స్క్వాడ్, జైరబ్ యూనిట్ వంటి వేర్వేరు గ్రూపులో ఇందులో ఇక్కడ క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నాయి. 500 మంది ప్రయాణికులు, ఆర్మీ సైనికులతో కూడిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇటీవలే హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ రైలును పాకిస్తాన్ సైన్యం విడిపించిన కొద్ది రోజుల్లోనే అదే బలూచిస్తాన్‌లో ఈ పేలుడు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications