రష్యా వైమానిక దాడి: యుద్ధ వాతావరణంలో ఉక్రెయిన్ లో జంట వివాహం; ఆపై కదనరంగంలోకి
ఉక్రెయిన్ దేశంపై రష్యా భీకర దాడి కొనసాగిస్తున్న సమయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. రష్యా సైనిక బాంబుల మోత, వైమానిక దాడులు, మోగుతున్న సైరన్ ల మధ్య ఉక్రెయిన్ దేశంలోని కీవ్ నగరంలోని చర్చిలో ఓ జంట వివాహం చేసుకుంది. రష్యా దాడుల మధ్య నిరాడంబరంగా వారు వివాహం చేసుకున్నారు. ఆపై తాము తమ దేశం కోసం కదనరంగంలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు.
Recommended Video

యుద్ధ వాతావరణంలో పెళ్లి చేసుకున్న నూతన జంట
ఇది వారు ఊహించిన పెళ్లి రోజు కాదు, అయినప్పటికీ రష్యా గురువారం తమ దేశంపై దాడి చేయడంతో యారినా అరివా మరియు ఆమె భాగస్వామి స్వియాటోస్లావ్ ఫర్సిన్ వివాహం చేసుకున్నారు. చాలా భయానక వాతావరణంలో కైవ్ యొక్క సెయింట్ మైఖేల్ చర్చిలో వారిద్దరూ ఒకరికొకరు జీవిత భాగస్వాములు అయ్యారు. ఇది మా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణం, కానీ ఈ విధంగా జరుపుకోవాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. ఈ జంట మే 6న వివాహం చేసుకుని, డ్నీపర్ నదికి అభిముఖంగా చాలా చాలా అందమైన టెర్రస్ రెస్టారెంట్‌లో జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్నారని అరివా చెప్పారు. చాలా అందమైన, ఆనందదాయకమైన వివాహాన్ని ప్లాన్ చేసుకున్న వారు రష్యా సైనిక దాడి నేపథ్యంలో ఊహించని విధంగా వివాహం చేసుకున్నారు.

ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య.. ఉద్రిక్త పరిస్థితి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం తెల్లవారుజామున ఉక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రకటించినప్పుడు ఒక్కసారిగా ఉక్రెయిన్లో పరిస్థితి మారిపోయింది. తెల్లవారుజామున వరుస క్షిపణి దాడులతో యుద్ధం ప్రారంభమైంది. రష్యన్ దళాలు మూడు వైపుల నుండి దేశంపై దాడి చేయడం ప్రారంభించారు. దీంతో మధ్య మరియు తూర్పు ఉక్రెయిన్‌లో యుద్ధవాతావరణం నెలకొంది. పది లక్షల మంది ఉక్రేయినియన్ల జీవితాలను రష్యా సైనిక చర్య ప్రభావితం చేసింది.

'మా భూమి కోసం మేం పోరాడతాం' అంటున్న కొత్త జంట
అక్టోబర్ 2019లో కైవ్ సెంటర్‌లో జరిగిన నిరసనలో కలుసుకున్న ఈ జంట, తాజా యుద్ధం నేపధ్యంలో తమ భవిష్యత్తు ఏమిటో తెలియక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పరిస్థితి కష్టంగా ఉంది, మేము మా భూమి కోసం పోరాడబోతున్నాము అని అరివా చెప్పారు. మేము బహుశా చనిపోవచ్చు, మేము దానికంటే ముందు కలిసి ఉండాలని కోరుకున్నామని అందుకే వివాహం చేసుకున్నామని పేర్కొన్నారు. వారి పెళ్లి తర్వాత, అరివా మరియు ఫర్సిన్ లు , దేశాన్ని రక్షించడంలో సహాయపడే ప్రయత్నాలలో చేరడానికి స్థానిక టెరిటోరియల్ డిఫెన్స్ సెంటర్‌కు వెళ్లడానికి సిద్ధమయ్యారు.

ఉక్రెయిన్ ను కాపాడుకోవటం మన బాధ్యత అన్న నూతన వధూవరులు
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఎలా జరిగిందనే దాని గురించి మాకు తెలుసు. ఉక్రెయిన్ ను మనం కాపాడుకోవాలి.. మనం ప్రేమించే మనుషులను, మనం నివసించే భూమిని కాపాడుకోవాలి'' అని వధువు అన్నారు. నేను మంచి జరగాలని ఆశిస్తున్నాను, కానీ నా భూమిని రక్షించుకోవడానికి నేను చేయగలిగినదంతా చేస్తాను అని పేర్కొన్నారు. ఆ జంటకు ఏ పని అప్పగిస్తారో అరీవాకు తెలియదు. బహుశా వారు మాకు ఆయుధాలను, రక్షణా కవచాన్ని ఇస్తే మేము వెళ్లి పోరాడతాము. ఉక్రెయిన్ దేశం కోసం ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారిరువురు పేర్కొన్నారు.

రష్యన్లు వెళ్ళిపోవాలని కోరుకున్న జంట
అరివా తన భర్తను భూమిపై తనకు అత్యంత సన్నిహిత మిత్రుడుగా అభివర్ణించారు . వారు ఏదో ఒక రోజు తమ వివాహ ఉత్సవాన్ని సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు గా పేర్కొన్నారు. బహుశా రష్యా మన దేశం నుండి వెళ్లిపోవచ్చని అరివా అన్నారు. అంతా సాధారణం అవుతుందని ఆశిస్తున్నామని, మన భూమి మనకు ఉంటుందని అనుకుంటున్నానని, రష్యన్లు లేకుండా మన దేశం సురక్షితంగా మరియు సంతోషంగా ఉంటుంది అని అరివా పేర్కొన్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications