వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: స్విమ్మింగ్ పూల్ మధ్యలో రంధ్రం.. తేరుకునే లోపే లాక్కెళ్లింది..

|
Google Oneindia TeluguNews

సాధారణంగా అయితే రోడ్డు కుంగుతుంది. కానీ ఓ చోట స్విమ్మింగ్ పూల్ లో ఒక్కసారిగా రంధ్రం పడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 43 అడుగుల లోతు రంధ్రం పడింది. ప్రమాదావశాత్తు ఓ వ్యక్తి మృతి చెందాడు. స్విమ్మింగ్ పూల్ ఉపరితలంపై ఉన్న సింక్ హోల్ ఆకస్మికంగా తెరుచుకోవడంతో ఒక వ్యక్తి విషాదకరంగా మరణించాడు. టెల్ అవీవ్‌కు ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్‌లోని కార్మీ యోసెఫ్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నాలుగు గంటల సమయం..

అతను రంధ్రంలో పడిపోతుండగా.. ఇతరులు కాపాడే ప్రయత్నం చేసినా అతను తప్పించుకోలేకపోయాడు. ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన పూల్ పార్టీ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వార్తాపత్రిక నివేదించిన ప్రకారం, జులై 21న లోతైన రంధ్రం నుంచి వ్యక్తి మృతదేహాన్ని వెలికితీసేందుకు నాలుగు గంటల సమయం పట్టింది.

A man died due to a hole in his swimming pool, A video goes viral on social media

క్లిల్ కిమ్హీ..

మృతి చెందిన వ్యక్తిని క్లిల్ కిమ్హీగా గుర్తించారు. అతని మరణానికి ఖచ్చితమైన కారణాన్ని అధికారులు గుర్తించలేకపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రమాద సమయంలో స్విమ్మింగ్ ఫుల్ లో ఆరుగురు ఉన్నారు. "నీటి మట్టం అకస్మాత్తుగా తగ్గడం ప్రారంభమైంది. ఒక రంధ్రం తెరుచుకుంది, ఇది సుడిగుండం సృష్టించింది" అని సాక్షిని ఉటంకిస్తూ చెప్పారు.

English summary
A man died tragically after a sinkhole on the surface of the swimming pool opened up spontaneously, dragging him and another man into a 43-foot-deep hole.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X