అక్కడ మళ్లీ కాల్పుల కలకలం: 14 మంది దుర్మరణం: మినీవ్యాన్‌లో వచ్చి బుల్లెట్ల వర్షం
జొహాన్నెస్‌బర్గ్: అమెరికాలో తరచూ కనిపించే గన్ కల్చర్.. ఈ సారి దక్షిణాఫ్రికాకు పాకింది. జొహాన్నెస్‌బర్గ్ శివార్లలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ బార్‌లో చోటు చేసుకున్న ఘర్షణే కాల్పులకు దారి తీసినట్టు పోలీసులు వెల్లడించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్టు వివరించారు.
జొహాన్నెస్‌బర్గ్ శివార్లలోని సొవెటొ టౌన్‌షిప్ సమీపంలో గల ఓ బార్‌లో వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. దుండగులు మినీబస్‌లో సంఘటనా స్థలానికి చేరుకున్నారని, తమ వెంట తెచ్చుకున్న తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, పారిపోయారు. సుమారు 10 నిమిషాల పాటు ఏకధాటిగా కాల్పులు కొనసాగించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

సంఘటన స్థలంలో బుల్లెట్ కార్‌ట్రిడ్జ్‌లను సొంతం చేసుకున్నామని గ్వటెంగ్ ప్రావిన్స్ పోలీస్ కమిషనర్ లెప్టినెంట్ జనరల్ ఇలియాస్ మవెల చెప్పారు. ఇదివరకు అమెరికాలో మాస్ షూటింగ్ సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. పలు నగరాల్లో ఇలాంటివి సంభవించాయి. గన్ కల్చర్ పేట్రేగిపోయిందక్కడ. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తుపాకుల లైసెన్స్ జారీని నియంత్రించింది. దీనికి సంబంధించిన బిల్లును కూడా ఆమోదించింది.
యూఎస్ కాంగ్రెస్‌లో ఇటీవలే ప్రవేశపెట్టిన ఈ గన్ కల్చర్ వ్యతిరేక బిల్లు 223-204 ఓట్లతో ఆమోదం పొందింది. మెజారిటీ సభ్యులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. ఈ బిల్లు ప్రకారం సెమీ ఆటోమేటిక్ తుపాకుల కొనుగోలు చేసే వారి వయస్సును పెరిగింది. అలాగే 15 రౌండ్స్ కంటే ఎక్కువ సామర్ధ్యం ఉన్న మందు గుండు సామాగ్రిని విక్రయించడానికి వీలు లేదని బిల్లులో పొందుపరిచారు. ఈ బిల్లు చట్టంగా ఆమోదం పొందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications