ఘోర విమాన ప్రమాదం: 62 మంది మృతి?
బ్రెజిల్ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలోని విన్హెడో నివాస ప్రాంతంలో 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. విమానం సావో పాలోలోని గౌరుల్‌హోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు విమానయాన సంస్థ VoePass తెలిపింది.
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. అయితే, ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. కాగా, దక్షిణ బ్రెజిల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఈ విషాదాన్ని ప్రకటించారు. విమానంలో ఉన్నవారంతా మరణించినట్లు కనిపిస్తోందని పేర్కొంటూ కొద్దిసేపు మౌనం పాటించాలని కోరారు.

అయితే మృతుల సంఖ్యపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అగ్నిమాపక సిబ్బంది, మిలటరీ పోలీసులు, సివిల్ డిఫెన్స్ బృందాలు ప్రమాద స్థలానికి తరలివెళ్లాయి. GloboNews ప్రసారం చేసిన ఫుటేజీలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న నివాస ప్రాంతంలో విమానం ఫ్యూజ్‌లేజ్‌గా కనిపించిన దాని నుంచి పెద్ద మంటలు, పొగలు పైకి లేచాయి.
❗️✈️💥🇧🇷 - #BREAKING: A plane has crashed in São Paulo, Brazil, claiming the lives of 70 people.
— 🔥🗞The Informant (@theinformant_x) August 9, 2024
Initial reports suggest the aircraft was en route from Cascavel (PR) to Guarulhos (SP).
Details about the victims are still unknown. According to eyewitness videos, the plane… pic.twitter.com/pK1sbUSG8h
ఫుటేజీలో విమానం ప్రమాదానికి ముందు క్రిందికి తిరుగుతున్నట్లు కూడా కనిపించింది. ఒక్కసారిగా కిందకు పడిపోయింది. నివాసాల సమీపంలో విమానం పడి మంటలు చెలరేగాయి. దీంతో విమానంలోని వారంతా చనిపోయినట్లు తెలుస్తోంది. నివాస ప్రాంతాలపై పడటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications