పాముతో సెల్ఫీ, ఆసుపత్రి బిల్లు రూ. కోటి

శాండియాగో: పాముతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తికి దూలతీరిపోయింది. ఆసుపత్రి బిల్లులు చుక్కలు చూపించడంతో సెల్ఫీలు వద్దు, మొబైల్ లు వద్దు దేవుడా అంటున్నాడు. అయితే ఆయన గారు తను చేసిన గొప్పపని గురించి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.

అమెరికాలోని శాండియాగోలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. టాడ్ పాస్లర్ అనే వ్యక్తికి సెల్ఫీలు తీసుకుని పిచ్చి ఉంది. ఒక సారి పాముతో సెల్ఫీ తీసుకోవాలని ఆశపడ్డాడు. అనుకున్నట్లుగానే రాటిల్ స్నేక్ దగ్గరకు వెళ్లాడు.

A San Diego man who was bitten by a rattlesnake

పాముతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. అదే సందర్బంలో ఆ విషసర్పం అతని భుజం మీద కాటు వేసింది. వెంటనే గురుడు ఆసుపత్రికి పరుగు తీశాడు. రెండు ఆసుపత్రులలో చికిత్స పోందిన టాడ్ పాస్లర్ అతి కష్టం మీద ప్రాణాలతో భయటపడ్డాడు.

అయితే తరువాత అతనికి ఆసుపత్రి వర్గాలు బిల్లులు ఇచ్చి చుక్కలు చూపించారు. ఆ బిల్లులు చూసిన టాడ్ పాస్లర్ దిమ్మతిరిగిపోయింది. 1,53,000 డాలర్లు బిల్లు చెల్లించాలని వైద్యులు చెప్పారు. భారత కరెన్సీ అయితే రూ. 97.57 లక్షలు. తరువాత ఈయన గారు నాకు ఇలా జరిగింది అంటు ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. అతని నిర్వాకంపై సోషల్ మీడియాలో పలువురు జోకులు వేస్తుంటే, కొందరు మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+