పాకిస్తాన్ అనూహ్య చర్య: భారీ వైమానిక దాడి- 15 మంది దుర్మరణం

Pakistab airstrikes: పాకిస్తాన్ అనూహ్య చర్యకు పాల్పడింది. భారీగా వైమానిక దాడికి పాల్పడింది. బాంబుల వర్షాన్ని కురిపించింది. ఈ ఘటనలో 15 మందికి దుర్మరణం పాలయ్యారు. వారిలో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు దాడుల తీవ్రతను బట్టి చూస్తే- మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు.

పొరుగునే ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌పై ఈ మెరుపు దాడికి పాల్పడింది పాకిస్తాన్. పక్‌టికా ప్రావిన్స్‌లోని బర్మాల్ జిల్లాలో మారణహోమాన్ని సృష్టించింది. ఈ జిల్లాలోని లామన్, ముర్గ్ బజార్ సహా ఏడు గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ దాడుల్లో. లామన్ అనే గ్రామంలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. ముర్గ్ బజార్ పూర్తిగా ధ్వంసమైంది.

A series of Pakistani airstrikes in Afghanistan kill 15

ఈ దాడుల కోసం జెట్ ఫైటర్లను వినియోగించినట్లు ఆఫ్ఘనిస్తాన్ మీడియా ఖామా ప్రెస్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. వజీరిస్తాన్ శరణార్థులు నివసించే గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొంది. ఆయా గ్రామాల్లో కుప్పకూలిన నివాసాల శిథిలాల్లో పలువురు చిక్కుకున్నారని, ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

సరిహద్దుల్లో తాలిబాన్ కార్యకలాపాలు విపరీతంగా పెరగడం, అక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడంతో వాటిని ధ్వంసం చేయడానికే పాకిస్తాన్ వైమానిక దాడులు సాగించి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఈ మధ్యకాలంలో పాకిస్తాన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నారు తాలిబన్లు. సరిహద్దు భద్రతా బలగాలపై తాలిబన్లు వరుస దాడులు సాగిస్తోన్నారు. ఈ దాడులను అడ్డుకోవాలంటూ కొంతకాలంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆఫ్ఘన్‌‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఫలితం ఉండట్లేదు.

దీనితో స్వయంగా పాకిస్తాన్ వైమానిక దళం రంగంలోకి దిగింది. సరిహద్దుల్లో కొత్తగా వెలిసిన తాలిబన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు దిగింది. ఈ దాడుల్లో సామాన్య పౌరులు దుర్మరణం పాలు కావడం పట్ల ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఈ దాడులకు తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.

వైమానిక దాడుల్లో సాధారణ ప్రజలు మరణించారని, ఇందులో వజీరిస్తానీ శరణార్థులు అధికంగా ఉన్నారని తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఖ్వారాజ్మీ వెల్లడించారు. వజీరిస్తానీ శరణార్థులను తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్‌‌ మిలిటెంట్లుగా మార్చుతోందనేది పాకిస్తాన్ ఆరోపణ. వాళ్లను తమ మీదికి దాడులు చేయడానికి శిక్షణ ఇస్తోందని విమర్శిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+