Submarine: సబ్ మెరైన్ పేలింది..! మరి అందులో ఉన్నవారు ఎక్కడా..
అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ శిథిలాలను చూడడానికి వెళ్లిన ఐదుగురు మృతి చెందినట్లు ఓషన్‌గేట్ తెలిపింది. 1912లో టైటానిక్ షిప్ అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణం చేస్తుండగా.. మంచు కొండను ఢీకొట్టింది. దీంతో అది మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 1,500 మందికి పైగా మృతి చెందారు. టైటానిక్ శిథిలాలను 1985 అట్లాంటిక్ సముద్రం అడుగు భాగంలో గుర్తించారు.
ఆ తర్వతా ఓషన్ గేట్ అనే సంస్థ మినీ సబ్ మెరైన్ లో పర్యటకులను తీసుకెళ్లి టైటానిక్ శిథిలాలను చూపించేది. ఈ క్రమంలోనే గత ఆదివారం రోజు మినీ సబ్ మెరైన్ లో బ్రిటిష్ బిలియనీర్ హమీష్ హార్డింగ్, పాకిస్తాన్ కు చెందిన వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్ తోపాటు ఓషన్ గేట్ ఎక్స్ పెడిషన్స ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్ టన్, సబ్ మెరైన్ ఆపరేటర్ పాల్ హెన్రీ టైటానిక్ శిథిలాలను చూడడానికి వెళ్లారు.

అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8:15 (సాయంత్రం 7:15pm IST) బయల్దేరారు. మినీ సబ్ మెరైన్ బయల్దేరిన దాదాపు రెండు గంటల తర్వాత అది రాడర్ తో కాంటాక్ట్ కోల్పోయింది. సబ్ మెరైన్ ఉత్తర అట్లాంటిక్ ఉపరితలం నుంచి రెండు మైళ్ల కంటే ఎక్కువ (దాదాపు 4 కిలోమీటర్లు) దూరంలో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ కోల్పోయింది. నిజానికి ఈ సబ్ మెరైన్ 7 గంటల్లో తిరిగి ఉపరితలంపైకి రావాలి.
ఆదివారం సాయంత్రం నుంచి గల్లంతైన సబ్ మెరైన్ కోసం కెనడా, అమెరికా కోస్ట్ గార్డు బృందాలు గాలింపు చేపట్టాయి. బుధవారం రోజు కెనడాకు చెందిన నిఘా విమానానికి సముద్రం నుంచి శబ్దాలు వచ్చినట్లు గుర్తించారు. దీంతో బృందలంతా అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టారు. అయినా కూడా సబ్ మెరైన్ ఆచూకీ లభించలేదు. సబ్ మెరైన్ లో కేవలం 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలే ఉండడంతో క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది.
అయితే అందులో ఉన్న ఆక్సిజన్ గురువారం సాయంత్రం 7 గంటల 15 నిమిషాల వరకే సరిపోతుందని నిపుణులు చెప్పారు. గురువారం సాయంత్రం రిమోట్ ఆపరేటేడ్ వెహికల్(ROV) సహాయంతో టైటానిక్ నౌకకు సమీపంలో కొన్ని శకలాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్‌గార్డ్ వెల్లడించింది. సబ్ మెరైన్ పేలిపోవడం వల్ల ఇలా జరిగినట్లు భావిస్తున్నారు. అయితే అందులో ఉన్నవారు ఏమయ్యారనేది ఇంకా తెలియరాలేదు.
ప్రఖ్యాత సినీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ టైటాన్ సబ్‌మెర్సిబుల్‌ను ఉపయోగించి టైటానిక్ శిధిలాల అన్వేషణను నిర్వహించాలనే 'భయంకరమైన ఆలోచన' చేసినందుకు విచారం వ్యక్తం చేశారు."ఇది భయంకరమైన ఆలోచన అని నేను అనుకున్నాను. నేను మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను, కానీ ఎవరైనా నా కంటే తెలివైనవారని నేను ఊహించాను. మీకు తెలుసా, ఎందుకంటే నేను ఆ సాంకేతికతతో ఎప్పుడూ ప్రయోగాలు చేయలేదు" అని అతను రాయిటర్స్‌తో చెప్పాడు.

గల్లంతైన సబ్ మెరైన్ లో ఆపరేటర్ గా ఉన్న ఫ్రెంచ్ పైలట్ పాల్-హెన్రీ నార్గోలెట్‌ను 'మిస్టర్ టైటానిక్' అని పిలుస్తారు. అతను టైటానిక్ శిధిలాల కోసం అనేక సాహసయాత్రలలో పాల్గొన్నాడు. సైట్‌లో ప్రపంచంలోని అగ్రగామి నిపుణులలో ఒకరిగా విస్తృతంగా గుర్తింపు పొందాడు. 77 ఏళ్ల అతను క్రాష్ సైట్‌కు డజన్ల కొద్దీ సబ్‌మెర్సిబుల్ డైవ్‌లను పూర్తి చేశాడు. 1987లో ఫ్రెంచ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎక్స్‌ప్లోయిటేషన్ ఆఫ్ ది సీలో చేరిన తర్వాత టైటానిక్‌కి మొదటి రికవరీ యాత్రకు నాయకత్వం వహించాడు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications