కోర్టులోనే గన్నుతో కాల్చుకున్న జడ్జి...!
అనేక సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ఓ న్యాయమూర్తి కోర్టు అవరణలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదికూడ కోర్టులో తీర్పు చెప్పిన తర్వాత తనను తాను కాల్చుకున్నారు. అంతకు ముందే ఓ కేసులో వాదనలు విన్న సదరు జడ్జి ఆరుగురు ముద్దాయిలను నిర్ధోషులుగా ప్రకటించారు. తీర్పు సమయంలో ఉద్వేగానికి లోనైన జడ్జీ సమాజంలో జరుగుతున్న పరిణామాలపై ఫేస్‌బుక్ లైవ్ ద్వార తెలిపారు. తుపాకితో కాల్చుకున్న జడ్డిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది.
యాలా కోర్టులో పని చేస్తున్న కనాకోర్న్ పియాంచన అనే జడ్జీ ముద్దాయిలను నిర్థోషులుగా ప్రకటించిన తర్వాత తన జేబులో ఉన్న తుపాకిని తీసీ కాల్చుకున్నారు. అంతకు ముందు ఒకరిని శిక్షించాలంటే అందుకు తగిన అధారాలు పక్కాగా ఉండాలి. ఒకవేళ లేకపోతే వారిని శిక్షించకూడదు అన్నారు. న్యాయ ప్రక్రియలో మరింత పారదర్శకత, విశ్వాసం ఉండాలి అంటూ తీర్పుకు ముందు ఫేస్‌బుక్ లైవ్‌లో ఉద్రేకపూరితంగా మాట్లాడారు.

దీంతో పాటు థాయ్‌లాండ్ కోర్టులో ధనవంతులకే అనుకూలంగా ఉంటాయని ,సామాన్య ప్రజల విషయంలో కఠినాత్మకంగా ఉంటాయని అనే విమర్శలు వస్తున్నాయని , వీటీని భరించలేకనే జడ్జీ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానిక మీడీయాలో అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఆయనకు వ్యక్తిగత కారణాల ఒత్తిడిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారనే అభిప్రాయం కూడ వ్యక్తం అవుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జడ్డి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్టు వెల్లడించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications