ట్రాన్స్‌జెండర్ జంటకు బిడ్డ పుట్టబోతోంది... వైరల్‌గా మారిన ప్రెగ్నెన్సీ ఫోటో షూట్

Click here to see the BBC interactive

బిడ్డకు జన్మనిచ్చేందుకు హార్మోన్ చికిత్సను ఆపుకున్న భారతీయ ట్రాన్స్‌జెండర్ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. వీరి ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

కేరళలో నివసించే 21 ఏళ్ల జియా పావల్, 23 ఏళ్ల జహాద్‌లు తమ లింగ మార్పిడి సమయంలో బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకున్నారు.

అబ్బాయిగా పుట్టి, అమ్మాయిగా మారిన పావల్ తాను తల్లి కావాలని ఎల్లప్పుడూ కోరుకునేది.

అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా మారిన జహాద్, ప్రస్తుతం గర్భం దాల్చాడు. త్వరలోనే ఈ జంట తమ బేబీని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించబోతుంది.

ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌ను షేర్ చేసిన ఈ జంటకు సోషల్ మీడియా పేజీల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

''ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు కూడా కుటుంబానికి అర్హులు'' అని ఫోటోలు షేర్ చేసిన పావల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు ట్రాన్స్‌జెండర్ నటి ఎస్‌ నేఘా కామెంట్ చేశారు.

''మా అనుభవం భారత్‌లో చాలా అరుదు. ఇప్పటి వరకు మనకు తెలిసి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో తల్లిదండ్రులైన వారు ఎవరూ లేరు'' అని పావల్, జహాద్ చెప్పారు.

భారత్‌లో 20 లక్షల మంది ట్రాన్స్‌జెండర్ ప్రజలున్నారని అంచనా. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని ట్రాన్స్‌జెండర్ కార్యకర్తలు చెబుతున్నారు. ఇతర ప్రజలు పొందే హక్కులన్ని ట్రాన్స్‌జెండర్లకు వర్తిస్తాయని 2014లోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

అయినప్పటికీ, ఇంకా విద్య, వైద్య సౌకర్యాలు పొందడంలో వీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సార్లు పక్షపాత ధోరణిని ఎదుర్కొంటూ, నిందలను కూడా భరించాల్సి వస్తుంది.

మూడేళ్ల క్రితం కలుసుకున్న పావల్, జహాద్‌లు, తమ ఇళ్ల నుంచి చిన్నప్పుడే పారిపోయి బయటికి వచ్చారు.

''నేను సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించాను. నన్ను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునేందుకు అనుమతించే వారే కాదు'' అని పావల్ చెప్పారు. ''నా తల్లిదండ్రులకు చాలా పట్టింపులు ఎక్కువ. నా జుట్టును ఎప్పుడూ కత్తిరిస్తూ ఉండేవారు. దీంతో, నేను డ్యాన్స్ క్లాస్‌లకు వెళ్లలేకపోయేదాన్ని'' అని చెప్పారు

యూత్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు తాను ఇంటి నుంచి పారిపోయానని, ఆ తర్వాత తిరిగి వెనక్కి వెళ్లలేదని పావల్ చెప్పారు.

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సెంటర్‌లో తాను నాట్యం నేర్చుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కోజికోడ్ జిల్లాలోని విద్యార్థులకు నాట్యం నేర్పుతున్నారు పావల్.

జహాద్ తిరువనంతపురం నగరంలోని మత్స్యకారుల కమ్యూనిటీలో ఒక క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు. అకౌంటెంట్‌గా శిక్షణ తీసుకున్న జహాద్, ప్రస్తుతం ఒక సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నారు.

తాను ట్రాన్స్‌జెండర్ తెలిసిన తర్వాత, జహాద్ ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. జహాద్ గర్భం దాల్చిన తర్వాత, ఆయన కుటుంబం ఆ జంటను ఆశీర్వదించింది. వారికి జహాద్ కుటుంబం అండగా నిలుస్తుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో జహాద్‌కు వారెంతో సాయపడుతున్నట్టు పావల్ చెప్పారు.

తొలుత ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటికి చెప్పొద్దని చెప్పిన జహాద్ తల్లి అనుమతితో గత వారమే వారు తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీల్లో ఈ శుభవార్తను ప్రకటించారు.

అయితే, పావల్ కుటుంబం మాత్రం ఇంకా తనని అంగీకరించడం లేదు.

ఏడాదిన్నర క్రితమే తాము బిడ్డను కనాలని నిర్ణయించుకున్నామని, ఆ సమయంలో ఇద్దరం తమ లింగ మార్పిడిలో వివిధ రకాల దశల్లో ఉన్నట్లు పావల్ బీబీసీకి తెలిపారు.

అప్పటికీ జహాద్ గర్భాశయం, అండాశయాలు తొలగించలేదు. దీంతో, డాక్టర్ల సూచన మేరకు ఈ జంట తమ హార్మోన్ థెరపీని ఆపేసుకుని, బిడ్డను కనాలని నిర్ణయించుకుంది.

ఈ జంటకు చికిత్స ఇస్తున్న డాక్టర్లు మాత్రం మీడియాతో మాట్లాడేందుకు అంగీకరించలేదు.

''ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, సెక్స్‌ హర్మోన్ థెరపీని వారు కొనసాగించుకోవచ్చు'' అని పలువురు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు చికిత్స అందించిన బెంగళూరు నగరంలోని ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ మహేశ్ డీఎం అన్నారు.

బిడ్డ పుట్టిన తర్వాత, తాము మరింత పని చేయాల్సి ఉంటుందని ఈ జంట చెబుతుంది.

జీవనం సాగించాలంటే చాలా కష్టమని, మరింత మంది విద్యార్థులకు తాను డ్యాన్స్ క్లాస్‌లు తీసుకుంటానని పావల్ అన్నారు.

బిడ్డ పుట్టిన తర్వాత రెండు నెలలకు జహాద్ కూడా తన పనికి వెళ్తాడని, తాను బేబీని చూసుకుంటానని చెప్పారు.

వారి ప్రెగ్నెన్సీని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కూడా సంతోషంగా ఆహ్వానిస్తోందని ఈ జంట తెలిపింది.

'అవును, మా కమ్యూనిటీలో, బయట ప్రపంచంలో మూసపోత పద్ధతులను నమ్మే వారు కొందరుంటారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తి బేబీని కనలేరని వారు అనుకుంటూ ఉంటారు'' అని పావల్ అన్నారు. అదంతా తాము పట్టించుకోమని చెప్పారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+