ఉవ్వెత్తున ఎగిసిన రాకాసి అలలు- సునామీ ప్రభావానికి గురైన ప్రాంతాలు ఇవే
రష్యాలో 8.7 తీవ్రతతో సంభవించిన భూకంప ప్రభావం.. జపాన్ పై తీవ్రంగా పడింది. ఆ దేశం తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలానికి గురవుతోంది. పసిఫిక్ తీరంలో హొక్కాయిడో నుండి వకయామా వరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడొచ్చని, సముద్రం ముందుకు చొచ్చుకు రావొచ్చని ప్రభుత్వం హెచ్చరించింది.
తీర ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేయించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకునేంత వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. జపాన్ తీర ప్రాంత నగరాలన్నీ కూడా సునామీ సైరన్ మోతలతో మార్మోగిపోయాయి.

మియాగి ప్రిఫెక్చర్‌లోని ఇషినోమాకి ఓడరేవులో 50, టోకాచి ఓడరేవు- 40, హొక్కాయిడో ఆగ్నేయ ప్రాంతంలోని ఎరిమో పట్టణంలో 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు కనిపించాయి. సునామీ ముప్పు ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
సునామీ వార్నింగ్ జారీ అయిన వెంటనే జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఏజెన్సీ చీఫ్ కియోమోటో మసాషి మాట్లాడారు. తీరం లేదా నదుల దగ్గర ఉన్న ప్రజలు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు తరలివెళ్లాలని, హెచ్చరిక తొలగించే వరకు సురక్షితంగా ఉండాలని కోరారు.
జపాన్ కాలమానం ప్రకారం ఈ ఉదయం 10 గంటలకు సునామీ అలలు సంభవించే ప్రమాదం ఉందని మసాషి వెల్లడించారు. అవి దేశ తీరాలను ఇప్పటికే చేరి ఉండవచ్చని చెప్పారు. సునామీలు చాలా కాలం పాటు పదే పదే వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. సునామీ అలల తీవ్రతంగా క్రమంగా పెరుగుతుందని అంచనా వేసినట్లు చెప్పారు.
రష్యాలో భూకంపం సంభవించడంతో జపాన్‌లోని సెండాయ్ విమానాశ్రయం రన్‌వేను మూసివేశారు. రన్‌వే మూసివేత ఉదయం 9:40 గంటలకు ప్రారంభమైందని, ప్రధాన తీర ప్రాంతానికి వెళ్లాల్సిన కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. విమానాశ్రయానికి రాకపోకలు నిలిపివేశారు.
ఉదయం 10:30 గంటలకు నెమురోలోని హనాసాకి పోర్ట్, ఉదయం 10:36 నిమిషాలలకు హమనకా టౌన్, 10:42 నిమిషాలకు కుషిరో ఓడరేవును 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు గల రాకాసి అలలు తాకాయి. జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ ఉదయం 9:40 గంటలకు సునామీ అడ్వైజరీని వార్నింగ్ గా మార్చింది.
జపాన్ ఉత్తర ప్రాంతం హక్కాయిడో నుండి వకయామా ప్రిఫెక్చర్ వరకు పసిఫిక్ తీర ప్రాంతాలన్నింటికీ వర్తించింది. సునామీ అలల ఎత్తు మూడు మీటర్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. సాధ్యమైనంత ఎత్తైన ప్రదేశానికి వెళ్లాలని, అంచనాలకు మించిన స్థాయిలో సునామీ అలలు సంభవించవచ్చని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ తెలిపింది.
పరిస్థితి తీవ్రత నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీల అధికారులు సమాచారం సేకరించడానికి స్థానిక ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. రేడియో, స్మార్ట్‌ఫోన్‌లు లేదా మొబైల్ ఫోన్‌ల ద్వారా సమాచారం తెలుసుకుంటూ ఉండాలని సూచించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications