Pakistan: పాకిస్థాన్ ప్రధాన మంత్రి తీరుపై విమర్శలు.. వైరల్ అయిన వీడియో..
గ్లోబల్ ఫైనాన్సింగ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు పారిస్‌లో ఉన్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. గురువారం పారిస్ లో జరిగిన సదస్సుకు షెహబాజ్ హాజరయ్యారు. ఆయన సదస్సుకు వెళ్లేసారికి వర్షం కురుస్తోంది. దీంతో ప్రోటోకాల్ అధికారిని షెహబాజ్ షరీఫ్ కారు దిగగానే గొడుగు పట్టుకుని సిద్ధంగా ఉంది. దీంతో ఆమె గొడుకు పట్టుకోగా.. షహెబాజ్ కొంత ముందు నడిచారు.
ఆ తర్వాత అధికారిణితో ఏదో మాట్లాడి.. గొడుగు తీసుకుని లోపలికి వెళ్లిపోయారు. దీంతో ఆ అధికారిణి వర్షంలో తడిసిపోయింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయంలో అధికారిక వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. అయితే పాక్ ప్రధాని అలా ప్రవర్తించడంతో ఆ వీడియో వైరల్ అయింది. 45 సెకన్లు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని నెటిజన్లు రకరకాలు స్పందించారు.

ఇది ఘోరమంటూ ఒకరు కామెంట్ చేయగా.. ఇంకా చాలా మంది అధికారులు అక్కడున్నారు కాబట్టి ఆమె (ప్రోటోకాల్ ఆఫీసర్) మరొక మహిళా అధికారి గొడుగును ఉపయోగించుకోవచ్చు" అని మరొక వ్యక్తి కామెంట్ చేశాడు. ఒక వ్యక్తి " ప్రధానిని అలా చూడటం నాకు మిస్టర్ బీన్ గుర్తుకు వస్తుంది" అని చమత్కరించారు. మరొక వినియోగదారు "ప్రధాని ఆమె గొడుగును దొంగిలించాడు" అని కామెంట్ చేశాడు.
Prime Minister of 🇵🇰 Muhammad Shehbaz Sharif 💚#PMatIntFinanceMoot pic.twitter.com/kFTQuhscoa
— PMLN (@pmln_org) June 22, 2023
కొత్త గ్లోబల్ ఫైనాన్సింగ్ ఒప్పందం కోసం సమ్మిట్ గురువారం పారిస్‌లో ప్రారంభమైంది, వివిధ రంగాలకు చెందిన 300 మందికి పైగా పాల్గొన్నారు. ఆరు రౌండ్ టేబుల్‌ల ద్వారా వాతావరణ మార్పు-సంబంధిత ఫైనాన్సింగ్ సమస్యలను చర్చించాలని భావిస్తున్నారు. వీటిలో అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణాన్ని సరిదిద్దడం, విశ్వాసాన్ని పునరుద్ధరించడం, వ్యూహాల కోసం భాగస్వామ్యాలను ఏర్పరచడం. ప్రైవేట్ రంగానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం వంటివి ఉన్నాయి.












Click it and Unblock the Notifications