Viral Video: భూ కంపం దాటికి పగిలిపోయిన రన్ వే.. వీడియో వైరల్..
టర్కీలో భూకంపం దాటికి రన్ వే పగిలిపోయింది.
సోమవారం తెల్లవారుజామున టర్కీ, సిరియాను భూకంపం వణికించింది. మూడు సార్లు బలమైన భూ కంపం రావడంతో టర్కీ, సిరియాలో తీవ్ర ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం భారీగా జరిగింది. ఈ భూకంపం వల్ల ప్రస్తుతం ఉన్న సమాచారం వరకు దాదాపు 3,800 మంది మృతి చెందారు. రిక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రత భూమి అనే సార్లు కంపించిడంతో టర్కీలోని చాలా నగరాలు అల్లాడిపోయాయి. భూ కంప తీవ్రతకు పెద్ద భవనాలు కుప్పకూలిపోయాయి.
హటయ్ ప్రావిన్స్
టర్కీలోని హటయ్ ప్రావిన్స్ లోని ఎయిర్ పోర్ట్ రన్ వే భూ కంపం దాటికి పగిలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రన్ వే పగిలి రెండుగా విడిపోవడంతో అన్ని విమానాలను రద్దు చేశారు. సోమవారం సంభవించిన భూకంపంలో ఈ దశాబ్దంలోనే అత్యంత భయంకరమైన ప్రకృతి విపత్తుగా ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు. టర్కీలో మొదటగా వచ్చిన భూకంపం ఈ దశాబ్దంలో అతి పెద్దదిగా శాస్త్రవేత్తలు తెలిపారు.
స్కేల్ పై 7.5 తీవ్రత
సోమవారం మొదటి భూకంపం వచ్చిన 12 గంటల తర్వాత రిక్టర్ స్కేల్ పై 7.5 తీవ్రతతో రెండోసారి భూ కంపం వచ్చింది. భూకంప కేంద్రాన్ని కహ్రామన్మరాస్ ప్రావిన్స్‌లోని ఎల్బిస్తాన్ జిల్లాలో గుర్తించారని బీబీసీ తెలిపింది. భూకంప దాటికి వేలకొద్దీ భవనాలు కూలిపోయాయి. ధ్వంసమైన భవనాలలో గజియాంటెప్ కోట ఉంది. ఈ కోటకు 2,000 సంవత్సరాలకు పైగా ఉన్న చరిత్ర ఉంది.
ఇతర దేశాల సాయం
భూకంపం తర్వాత 10 గంటల్లోనే 50కి పైగా ప్రకంపనలను అధికారులు లెక్కించారు. మరోవైపు ఈ సంక్షోభంపై అంతర్జాతీయంగా స్పందించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు. యూరోపియన్ యూనియన్ శోధన, రెస్క్యూ బృందాలను టర్కీకి పంపుతోంది. 76 నిపుణులు, పరికరాలు రెస్క్యూ డాగ్‌లను పంపనున్నట్లు UK తెలిపింది. ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్, యుఎస్ కూడా సహాయం చేయడానికి ముందుకొచ్చాయి.












Click it and Unblock the Notifications