Asia Cup2022: ఏ ఫ్యూ మినట్స్ లేటర్.. ఆసియా కప్ ఫైనల్లో దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన ఇండియా అభిమాని..
ఆసియా కప్ ముగిసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన శ్రీలంక కప్ ఎగురేసుకుపోయింది. ఫైనల్లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో లంకేయులు విజయం సాధించారు. అయితే ఈ మ్యాచ్ జరేటప్పుడు ప్రేక్షకుల స్టాడ్స్ లో ఓ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..

రిజ్వాన్
శ్రీలంకతో మ్యాచ్ లో పాక్ 171 పరుగుల లక్ష్యఛేదనకు దిగింది. ఓపెనర్ రిజ్వాన్ బాగా ఆడుతున్నాడు. 15 ఓవర్ 5వ బంతికి రిజ్వాన్ సిక్స్ కొట్టాడు. అయితే స్టాడ్స్ లో పాక్ అభిమాని శ్రీలంక అభిమాని వద్దకు వెళ్లి కాస్త ఓవర్ చేశాడు. అప్టర్ ఫ్యూ మినట్స్.. అంటే 16వ ఓవర్ లో మొదటి బంతికి రిజ్వాన్ ఔటయ్యాడు. దీంతో శ్రీలంక అభిమాని ఆనందంతో ఎగిరి గంతేశాడు.

జేర్సీ చూసి షాక్
మరో వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. ఆ తర్వాత శ్రీలంక అభిమాని షర్ట్ విప్పాడు. కానీ అతని లోపలో మరో దేశం జేర్సీ ఉంది. అది టీమిండియా జేర్సీ... దీంతో అక్కడున్నవారు అందరు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అయింది. ఈ వీడియోను క్రిక్ పిడియా అనే ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
6 లక్షలకు పైగా వ్యూస్
ఈ వీడియోకు 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 32 వేలకు పైగా లైక్స్ రాగా.. 4 వేలకు పైగా మంది రీ ట్వీట్లు చేశారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. ఇది ఎవరు ఊహించలేదు కుదూ.. అంటూ కామెంట్ చేశారు. మరొకరు ఇదేంది భయ్యా అంటూ కామెంట్ చేశారు. మొత్తాని ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications