ఆపరేషన్ సింధూర్ కు బ్రేక్ వెనుక షాకింగ్ రీజన్ ? చేతులెత్తేసిన ట్రంప్ ?
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పీచమణించేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. తొలుత ఉగ్రశిబిరాల నుంచి మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ ఆ తర్వాత పాకిస్తాన్ లోని ఎయిర్ బేస్ లు, మిలిటరీ స్థావరాల వరకూ వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే లాహోర్ లోని ఆయుధ రక్షణ వ్యవస్థల్ని సైతం భారత ఆర్మీ కుప్పకూల్చింది. అయితే ఇదంతా ఉధృతంగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా భారత్-పాకిస్తాన్ ల తరఫున అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణ ప్రకటన చేశారు. దీనిపై భారత్ లో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ జోరుగా సాగుతున్న సమయంలో అమెరికా మాట విని భారత్ కాల్పుల విరమణ ప్రకటించడం దేశంలో మెజార్టీ జనానికి నచ్చలేదు. ఓవైపు పాకిస్తాన్ గుండెలపై కొట్టామని, తమ మహిళల సింధూరాలు చెరిపేస్తే ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రశిబిరాలనే చెరిపేశామని ప్రధాని మోడీ వెల్లడించారు. అయితే కాల్పుల విరమణను మాత్రం ఆయన సమర్ధించుకోలేకపోయారు. ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానే యుద్దం ఆపానని పదే పదే చెప్పుకుంటున్నా ప్రధాని మోడీ మాత్రం ఈ విషయాన్ని అస్సలు ప్రస్తావించడం లేదు.

అయితే ఆపరేషన్ సింధూర్ ను అర్ధాంతరంగా ఆపేయడం వెనుక పలు సంచలన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉధృతంగా సాగుతున్న తరుణంలో పాకిస్తాన్ లోని అణు స్థావరమైన కిరానా హిల్స్ కు సమీపంలోనే ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ పైనా మిస్సైళ్ల దాడి చేసింది. వాస్తవానికి ఇది కిరానా హిల్స్ కు సమీపంలోనే ఉంది. కిరానా హిల్స్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముషాఫ్ ఎయిర్ కాంప్లెక్స్ వరకూ భూగర్భ సొరంగాలు ఉన్నట్లు సమాచారం. వీటికి సమీపంలోనే ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ పై మిస్సైళ్లు పక్కనే ఉన్న సొరంగంలో ఉన్న అణు వార్ హెడ్లను తాకినట్లు తెలుస్తోంది.
ఇలా భారత మిస్సైళ్లు సర్గోదా ఎయిర్ బేస్ ను టార్గెట్ చేసే ప్రయత్నంలో కిరానా హిల్స్ కూ ముషాఫ్ కాంప్లెక్స్ కూ మధ్య ఉన్న భూగర్భ సొరంగాలపై పడి అందులో ఉన్న అణు వార్ హెడ్లను తాకడంతో రేడియేషన్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇదే భారత్ తన ఆపరేషన్ సింధూర్ కు బ్రేక్ ఇచ్చేందుకు కారణమైనట్లు సమాచారం. అణు ధార్మికత కారణంగా రేడియేషన్ లీక్ అవుతూ పోతే ఆ తర్వాత ఊహించని ఉపద్రవం తప్పదు. అయితే దీన్ని సరిదిద్దాలంటే భారత్ దాడులు ఆపక తప్పదు. ఈ విషయాన్ని ట్రంప్ కు చెప్పిన భారత ప్రధాని మోడీని కాల్పుల విరమణ దిశగా ఒప్పించినట్లు తెలుస్తోంది.

మరోవైపు భారత్ పాకిస్తాన్ లోని కిరానా హిల్స్ లో ఉన్న అణు ప్లాంట్ పై దాడి చేసినట్లు అంతర్జాతీయంగా ప్రచారం జరుగుతోంది. దీన్ని భారత ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే ఖండించింది. తాము కిరానా హిల్స్ ను టార్గెట్ చేయలేదని తేల్చిచెప్పేసింది. అయితే దీనికి తగ్గర్లో ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ పై దాడి చేసే ప్రయత్నంలో జరిగిన అణు రేడియేషన్ లీకేజీ వల్లే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అంతే కానీ ట్రంప్ చెబుతున్నట్లు వాణిజ్యం బూచి చూపి భారత్ ను అమెరికా దారికి తెచ్చుకుందన్న వాదన తప్పని అర్దమవుతోంది.












Click it and Unblock the Notifications