బ్రిటన్‌కు పాకిన అల్లర్లు: పలుచోట్ల విధ్వంసం: యూకే వెళ్లొద్దంటూ కోరిన భారత్

Sheikh Hasina: పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా.. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల హిండన్ ఎయిర్‌బేస్‌లో తలదాచుకుంటోన్నారు.

బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ అల్లర్లు కొనసాగుతూనే వస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో షేక్ హసీనా అక్రమంగా విజయం సాధించారనేది అక్కడి ప్రజల ఆరోపణ. దీనికితోడు ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల్లో కోటా వ్యవస్థ.. వంటి ఆమె సారథ్యంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి దారితీసింది.

Advisory issued for Indian Citizens visiting the UK

సొంతదేశం నుంచి హెలికాప్టర్‌లో పారిపోయిన షేక్ హసీనా భారత్‌కు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఆమె తొలుత అగర్తల చేరుకున్నారు. అక్కడి నుంచి సీ-30 రకం బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రవాణా హెలికాప్టర్ హెర్కులెస్‌లో హిండన్ ఎయిర్‌బేస్‌కు వచ్చారు.

దీని తరువాత బ్రిటన్‌లో అశాంతియుత వాతావరణం నెలకొంది. పలు చోట్ల హింసాత్మక పరిస్థితులు తలెత్తాయి. బెల్‌ఫాస్ట్, డార్లింగ్టన్, ప్లైమౌత్‌‌లల్లో దాడులు, ప్రతిదాడుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలువురు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి.
బెల్‌ఫాస్ట్‌ దక్షిణ ప్రాంతంలో సూపర్ మార్కెట్‌కు నిప్పు పెట్టారు.

సౌత్ పోర్ట్‌లో ముగ్గురు యువతులు కత్తిపోట్లకు గురై మరణించడం దీనికి కారణమైంది. దీనికి నిరసనగా వందలాదిమంది ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. ఈ సందర్భంగా పలుచోట్ల వాళ్లు దాడులకు పాల్పడ్డారు. కొన్ని చోట్ల పోలీసులపైనా రాళ్ల వర్షాన్ని కురిపించారు.

ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. దాడులకు పాల్పడిన వారిలో 370 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతోంది. దొరికిన నిరసనకారులను దొరికినట్టే అరెస్ట్ చేస్తోన్నారు పోలీసులు. ఈ ఉద్రిక్త పరిస్థితులపై బ్రిటన్ ప్రధానమంత్రి కీత్ స్టార్మర్ స్పందించారు. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ అల్లర్లు, హింసాత్మక పరిస్థితుల పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వీటిని దృష్టిలో ఉంచుకుని ట్రావెల్ అండ్ సేఫ్టీ అడ్వైజరీని జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో నివసించే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బ్రిటన్‌కు వెళ్లాలనుకునే వారు వీలైతే తమ ప్రయాణాలను మానుకోవాలని కోరింది.

ఈ మేరకు లండన్‌లో గల భారత హైకమిషన్ కార్యాలయం అడ్వైజరీని ఇచ్చింది. నిరసన ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లొద్దని పేర్కొంది. ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, అవసరమైతే తమ కార్యాలయానికి సమాచారం అందించాలని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+