వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవుడు ఉన్నాడు.. 5 నెలల తర్వాత ఫ్యామిలీ చేతికి పసిగుడ్డు..మురిసిన పేరంట్స్

|
Google Oneindia TeluguNews

పసిగుడ్డు.. పేరంట్ స్వయంగా అప్పగించేశాడు. తాను వెళ్లే లోపు.. సైన్యం రాక వెళ్లడం వీలుపడలేదు. కానీ ఆ పసిగుడ్డు మరొకరి చెంత ఉన్నాడు. అలా 5 నెలల తర్వాత ఆ బాబు కుటుంబంతో కలిశాడు. దీంతో ఆ కుటుంబం తెగ సంబరపడిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన యదార్థ గాధ ఇదీ. తాలిబన్లు తిరిగి అఫ్ఘానిస్తాన్‌ను హస్తగతం చేసుకోవడంతో వారి అరాచక పాలనలో ఉండలేమని చాలా మంది పౌరులు ఆ దేశం నుంచి వివిధ దేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కాబుల్ విమానాశ్రయానికి చేరుకునేందుకు అఫ్ఘాన్ పౌరులు భారీ సంఖ్యలో సరిహద్దుల వద్దకు చేరుకోవడంతో తాలిబన్ సైన్యాలు వారిని కంట్రోల్ చేసేందుకు విరుచుకుపడ్డాయి. చాలామంది సైన్యాల నుంచి తప్పించుకునే క్రమంలో తమవారిని పొగొట్టుకున్నారు.

2 నెలల పసిగుడ్డు


ఆగస్టు 19వ తేదీన రెండు నెలల కూడా నిండని ఓ బాలుడు కూడా తన తల్లిదండ్రుల నుంచి వేరు అయ్యాడు. ఆ బాలుడి పేరు సోహేల్ అహ్మది. ఆ బాలుడికి సంబంధించిన ఫొటోలు కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. అన్నీ ఏజెన్సీలు వార్తాను ప్రముఖంగా ప్రచురించాయి. సరిహద్దు వద్ద గోడ దాటే క్రమంలో సోహేల్ అహ్మదిని ఓ అమెరికన్ సైనిక అధికారికి తండ్రి అహ్మది అందిస్తున్న ఫొటో బాగా వైరల్ అయింది. ఐదు నెలల తర్వాత తప్పిపోయిన ఆ బాలుడి ఆచూకీ లభించింది. అహ్మది తన భార్య, పిల్లలతో కలిసి అమెరికా విమానం ఎక్కేందుకు కాబుల్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అప్పటికే విమానాశ్రయం బయట భారీ సంఖ్యలో జనాలు ఉన్నారు. లోపలికి వెళ్లేందుకు వీల్లేదు. ఎయిర్‌పోర్టు ప్రహరీ గోడ ఎక్కి చాలామంది లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి గోడ నిల్చొని ఉన్న అమెరికన్ బలగాలు సహకరిస్తున్నాయి. అహ్మది కూడా తన భార్య, పిల్లలను తీసుకుని గోడ వద్దకు చేరుకున్నాడు. మొదట రెండు నెలల సోహేల్ అహ్మదిని గోడపై ఉన్న ఓ అమెరికన్ అధికారికి అందించాడు. ఆయన తీసుకుని బాబును లోపల ఉన్నవారికి అందించేశారు. అలా బాబు లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే తాలిబన్ బలగాలు ఎయిర్‌పోర్టుకు రావడంతో అక్కడి జనాలు వెళ్లిపోవాల్సి వచ్చింది.

లోపల సోహెల్..

అహ్మది కూడా తన కుటుంబాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. అప్పటికే సోహేల్ లోపలికి వెళ్లిపోయాడు. ఏం చేయాలో తోచలేదు. వెంటనే ఫ్యామిలీని ఇంటి వద్ద వదిలి మళ్లీ అక్కడి వచ్చాడు. విమానాశ్రయం లోపలికి వెళ్లి బాబు కోసం ఆరాతీశాడు. ఫలితం లేకుండా పోయింది. కొద్దిరోజుల తర్వాత అహ్మది తన భార్య పిల్లలతో కలిసి టెక్సాస్ వెళ్లిపోయారు. విమానాశ్రయంలో ఒంటరిగా ఏడుస్తున్న సోహేల్‌ను చూసిన హమీద్ సఫీ అనే ట్యాక్సీ డ్రైవర్ తనతోపాటు ఇంటికి తీసుకెళ్లిపోయాడు. తనకు ముగ్గురు కూతుళ్లు ఉండడంతో సోహేల్‌ను తన కుమారుడిగా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. 5 నెలలు గడిచిపోయాయి. ఇటీవల ముగ్గురు కుమార్తెలతోపాటు సోహేల్ ఫొటోలను హమీద్ ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఆ ఫొటోలను చూసిన అతని ఇరుగుపొరుగు వారు సోహేల్‌ను గుర్తు పట్టారు.

పట్టించిన ఫేస్‌బుక్

సోహేల్ ఫొటోలతో ప్రచురితమైన కథనాలు వారికి గుర్తుకు వచ్చాయి. కామెంట్ల రూపంలో హమీద్‌ను పిల్లోడి గురించి ఆరా తీశారు. ఆ నోటా ఈ నోటా అహ్మది అత్తగారికి చేరింది. అహ్మది మామ మహ్మద్ ఖసేం రజ్వీ ఫేస్‌బుక్ ద్వారానే హమీద్‌కు సోహేల్ తమ మనవడు అని, తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరారు. హమీద్ అంగీకరించలేదు. ఆయన పోలీసులను ఆశ్రయించి తన మనవడిని హమీద్ కిడ్నాప్ చేశాడంటూ కేసు పెట్టారు. వెంటనే రంగంలోకి దిగిన తాలిబన్ పోలీసులు ఈ విషయంలో కలుగజేసుకుని హమీద్‌కు రూ.70వేల పరిహారం ఇప్పించి, బాబును రజ్వీకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న టెక్సాస్‌లో ఉన్న పేరంట్స్ ఆనందానికి అవధుల్లేవు. వీడియో కాల్ ద్వారా బాబును చూసుకుని కుటుంబం మొత్తం మురిసిపోయింది.

English summary
infant boy handed in desperation to a soldier across an airport wall in the chaos of the American evacuation of Afghanistan has been found and reunited with his relatives
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X