ఆఫ్ఘన్ లో దారుణం : అరవై ఏళ్ల వృద్ధుడు ఆరేళ్ల బాలికను..

ఆఫ్ఘనిస్తాన్ : పేదరికం లింగ వివక్ష ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తోంది. ఊహ కూడా తెలియని వయసులోనే వాళ్ల జీవితాలు తీవ్ర నైరాశ్యంలోకి జారుకుంటున్నాయి. ఇక మంత ఛాందస భావాలు అధికంగా ఉండే దేశాల్లో అయితే ఆడపిల్లల ధీనావస్థ వర్ణనాతీతం. ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకున్న ఈ ఘటనను చూస్తే ఆడపిల్లలపై ఎంతటి వివక్ష కొనసాగుతుందో అర్థమవుతుంది.

కాబుల్ కు చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు.. ఆరేళ్ల ఆ బాలికను 60 ఏళ్ల వృద్ధుడికి ఇచ్చి వివాహం జరిపించారు. బాలికను వివాహం చేసుకున్న మహమ్యద్ కరీం అనే ఆ వృద్ధుడు.. బాలిక తల్లిదండ్రులే తనకు దైవప్రసాదంగా బాలికనిచ్చి పెళ్లి చేశారని చెప్పడం గమనార్హం. కాగా ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆఫ్ఘన్ ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది.

Afghan cleric arrested after marrying six-year-old child, parents say she was abducted

వివాహంతో షాక్ గురైన ఆ బాలిక మాట్లాడడానికి కూడా భయపడుతోందని ఆఫ్ఘన్ మహిళా వ్యవహారాల శాఖ అధిపతి మాసూమ్ అన్వారీ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో బాలికను పెళ్లి చేసుకున్న కరీం ను అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు అక్కడి గవర్నరు అధికార ప్రతినిధి అబ్దుల్ హై ఖతీబీ చెప్పారు. అలాగే బాలికను మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

16ఏళ్లకే పెళ్లిళ్లు చేసుకునే చట్టం ఆఫ్ఘన్ లో అమలులో ఉండడంతో.. ఆ చట్టం వల్ల ఎంతోమంది బాలికలు విద్యకు దూరమై భద్రత లేకుండా బ్రతుకున్నారు. ముఖ్యంగా పేదరికం వల్లే ఆఫ్ఘన్ లో ఈ బాల్య వివాహాల తంతు కొనసాగుతున్నట్లు ఆఫ్ఘన్ స్వతంత్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ సీమా సమార్ తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+