తాలిబన్ల చేతుల్లోకి ఆప్ఘనిస్తాన్-సర్కార్ దౌత్య ప్రయత్నాలు- అధికారంలో భాగస్వామ్యం ఆఫర్

ఆప్ఘనిస్తాన్ లో పరిస్ధితులు నానాటికీ క్షీణిస్తున్నాయి. నిన్న మొన్నటివరకూ అమెరికా బలగాల రక్షణలో ఉన్న ఆప్ఘన్ దేశం ఇప్పుడు తాలిబన్ల దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆప్ఘన్ ప్రభుత్వం చేతుల్లో ఉన్న పలు కీలక ప్రాంతాలను తాలిబన్లు క్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారు. హింసాత్మక చర్యలకు దిగడం ద్వారా ఆఫ్ఘన్ బలగాలను హతమారుస్తున్నారు. దీంతో ప్రభుత్వం దిక్కుతోచని స్ధితిలో పడుతోంది. చివరికి దీనికి పరిష్కారాలు వెతకడం మొదలుపెట్టింది. తాలిబన్లతో అధికారాన్ని పంచుకోవడం ద్వారా ఈ సంక్షోభానికి ముగింపు పలికే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

సంక్షోభంలో ఆప్ఘనిస్తాన్

సంక్షోభంలో ఆప్ఘనిస్తాన్

భారత ఉపఖండ దేశమైన ఆప్ఘనిస్తాన్ లో హింసాత్మక పరిస్ధితులు నెలకొంటున్నాయి. అమెరికా బలగాలు ఆప్ఘన్ ను వదిలి వెళ్లిన తర్వాత అక్కడ తాలిబన్లు విజృంభిస్తుండటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ బలగాలకు, తాలిబన్లకూ మధ్య సాగుతున్న పోరులో సామాన్య పౌరులు బలైపోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ బలగాలను, పోలీసులను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు ఆత్మాహుతి దాడులకు దిగుతుండటంతో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే బాంబు దాడుల్లో భారీగా పోలీసుల్ని, బలగాల్ని కూడా కోల్పోయిన ప్రభుత్వం.. ఇప్పుడు తాలిబన్లను అడ్డుకోవడం కష్టంగా మారుతోంది. కాబూల్ తో పాటు పలు నగరాలు, పట్ణణాలు నిత్యం దాడులతో దద్దరిల్లుతున్నాయి. దీంతో రోజురోజుకీ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. ఇలాంటి పరిస్దితుల్లో ప్రభుత్వానికి కూడా ఏమీ పాలుపోవడం లేదు.

 తాలిబన్ల చేతుల్లోకి ఉత్తర, పశ్చిమ ఆప్ఘనిస్తాన్

తాలిబన్ల చేతుల్లోకి ఉత్తర, పశ్చిమ ఆప్ఘనిస్తాన్

అమెరికా బలగాలు ఉపసంహరించాక ఆప్ఘనిస్తాన్ లో నెలకొంటున్న పరిస్ధితులతో తాలిబన్ల పట్టు పెరుగుతోంది. ముఖ్యంగా ఆప్ఘన్ బలగాల్ని లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు చేస్తున్న దాడులతో ప్రభుత్వం పూర్తిగా ఆత్మరక్షణలో పడుతోంది, ఇప్పటికే దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఆప్ఘనిస్తాన్ లోని వ్యూహాత్మక నగరం ఘజనీని సైతం తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు. కాబూల్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారన్న వార్తలతో ప్రభుత్వానికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు తాజాగా నిర్దారించాయి. అక్కడి గవర్నర్ ను సైతం నిర్భంధించినట్లు తెలుస్తోంది.

మధ్యవర్తుల్ని పంపుతున్న ప్రభుత్వం

మధ్యవర్తుల్ని పంపుతున్న ప్రభుత్వం

ఆప్ఘనిస్తాన్ లోని ఉత్తర, పశ్చిమ సహా పలు కీలక ప్రాంతాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోతుండటంపై ప్రభుత్వం అంతర్మథనంలో ఉంది. దేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు వీలుగా తాలిబన్లతో శాంతి చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం తాలిబన్లను ఒప్పించేందుకు మధ్యవర్తుల్ని పంపుతోంది. అయితే ఇప్పటికే రెచ్చిపోతున్న తాలిబన్లు ఇందుకు అంగీకరించడం లేదు. దేశంలోని మధ్యవర్తులతో పాటు విదేశాల్లోనూ తాలిబన్ల ప్రతినిధులతో ఆఫ్ఘన్ ప్రభుత్వ పెద్దలు మధ్యవర్తిత్వం నెరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు తాలిబన్లు ఎంతమేరకు అంగీకరిస్తారన్నది ప్రశ్నార్ధకంగానే ఉంది. అయినా ప్రభుత్వం తమ ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తూనే ఉంది.

ఖతార్ ఖతార్ దౌత్యం

ఖతార్ ఖతార్ దౌత్యం


ఆప్ఘనిస్తాన్ లో పరిస్ధితులు నానాటికీ క్షీణిస్తుండటంతో ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చల కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళితే ఇబ్బందులు తప్పవని భావిస్తున్న పొరుగు దేశాలు దౌత్య ప్రయత్నాల్ని సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్ల ప్రతినిధులతో ఆఫ్ఘన్ ప్రభుత్వం తరఫున మధ్యవర్తులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ దౌత్య చర్చల్లో పలు కొత్త ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. వీటిపై ఇంకా తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు. ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలకు తాలిబన్లు అంగీకరించడం లేదన్న వార్తలు కలవరపెడుతున్నాయి.

 తాలిబన్లకు అధికారంలో భాగస్వామ్యం ఆఫర్

తాలిబన్లకు అధికారంలో భాగస్వామ్యం ఆఫర్

ఖతార్ రాజధాని దోహాలో జరుగుతన్న చర్చల్లో తాలిబన్లు హింసకు స్వస్తి పలికితే వారితో అధికారాన్ని పంచుకునేందుకు సిద్ధమని ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాలిబన్ల విజృంభణతో దేశంలో పలు ప్రాంతాలు చేజారిన నేపథ్యంలో హింసకు అడ్డుకట్ట వేస్తే అధికారంలో భాగస్వాముల్ని చేస్తామని ప్రభుత్వం తాలిబన్లకు ఆఫర్ ఇస్తోంది. అయితే దీనిపై వెంటనే నిర్ణయం తీసుకునేందుకు తాలిబన్లు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే మరికొన్ని రోజులు ఆగితే ఎలాగో ఆప్ఘనిస్తాన్ ను తాము పూర్తిగా ఆక్రమించుకుంటామని తాలిబన్లు ధీమాగా ఉన్నారు. అదే జరిగితే తమ చిరకాల కోరిక నెరవేరినట్లవుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం ప్రకటించరాదని భావిస్తున్నారు.

 భారత్ కు పెరుగుతున్న కలవరం

భారత్ కు పెరుగుతున్న కలవరం

ఆప్ఘనిస్తాన్ లో నెలకొంటున్న పరిణామాలు మిత్రదేశమైన భారత్ ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. గతంలో ప్రధాని మోడీ బహుకరించిన విమానాన్ని సైతం తాలిబన్లు స్వాధీనం చేసుకోవడం, వరుసగా ఆప్ఘన్ దళాలపై జరుపుతున్న దాడులతో భారత్ కలవరపడుతోంది. గతంలో ఆప్ఘనిస్తాన్ అభివృద్ధి కోసం భారీ సాయం చేసిన భారత్ కు ఇప్పుడు అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. ఆప్ఘన్ సర్కార్ కు తాము చేసిన కోట్లాది రూపాయల సాయం వృధా కావడంతో పాటు తమను వ్యతిరేకించే తాలిబన్లు క్రమంగా దేశంపై పట్టు పెంచుకోవడం భారత్ కు ఏమాత్రం మింగుడు పడటం లేదు. దీంతో సాధ్యమైనంత త్వరగా ఆప్ఘన్ లో హింసను అరికట్టేందుకు ప్రయత్నాలు చేయాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే చాలా మటుకు ఆప్ఘన్ నగరాలు, పట్టణాల్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలా వద్దా అన్న అంశంలో భారత్ మల్లగుల్లాలు పడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+