Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆఫ్ఘనిస్తాన్ పై ప్రపంచ దేశాల ఆందోళన .. ఆఫ్ఘన్ పౌరులను కాపాడాలన్న మలాలా, యూఎన్ కింకర్తవ్యం ?

ప్రపంచమంతా విస్మయానికి గురైన సంఘటన ఆఫ్ఘనిస్థాన్ లో చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న ఆఫ్ఘనిస్తాన్, భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు మళ్లీ స్వాతంత్రాన్ని కోల్పోయింది. కర్కశ చట్టాలు, కఠిన నిబంధనలతో మానవ హక్కులను హరించే తాలిబన్ల ఆదిపత్యంలోకి ఆఫ్ఘనిస్తాన్ దేశం వెళ్ళటం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాసులను వణికిస్తుంది. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లకు వశమైన నేపథ్యంలో స్థానిక పౌరుల జీవనం, వారి హక్కుల విషయంలో ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

కాబూల్ విమానాశ్రయంలో వేలాదిగా ప్రజలు, ఇతర దేశాలకు తరలిపోయే యత్నం

కాబూల్ విమానాశ్రయంలో వేలాదిగా ప్రజలు, ఇతర దేశాలకు తరలిపోయే యత్నం

తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించి ఆఫ్ఘనిస్థాన్ రాజధానిని స్వాధీనం చేసుకుని అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆదివారం కూలిపోయింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి వెళ్లిపోయారని మరియు ఆఫ్ఘనిస్థాన్ యొక్క ఇస్లామిక్ ఎమిరేట్ యొక్క పునస్థాపన ను తాలిబన్ త్వరలో ప్రకటించబోతుందని అనేక నివేదికలు సూచించాయి. ఆఫ్ఘనిస్థాన్ రాజధానిపై తాలిబన్ నియంత్రణ ఉందని ప్రకటించిన తర్వాత వేలాదిగా ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి చేరుకుని ఇతర దేశాలకు తరలి పోయే ప్రయత్నం చేస్తున్నారు.

తరలిపోతున్న దౌత్య కార్యాలయాల సిబ్బంది

తరలిపోతున్న దౌత్య కార్యాలయాల సిబ్బంది

ఆఫ్ఘన్ ప్రజలు తీవ్ర భయాందోళన మధ్య ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ప్రస్తుతం శాంతి భద్రతల సంక్షోభం నెలకొంది. ఇప్పటికే ఆఫ్ఘన్ తాలిబాన్ల వశమైన నేపథ్యంలో అనేక దేశాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి దౌత్య కార్యాలయాల సిబ్బందిని, ఇతర సిబ్బందిని తరలించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ తాలిబన్ల విషయమైన ఆఫ్ఘనిస్తాన్ విషయంలో స్పందించారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ నియంత్రణలోకి తీసుకున్న వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని మలాలా పేర్కొన్నారు.

మహిళల, మైనారిటీల , బాలికల రక్షణపై ఆందోళన వ్యక్తం చేసిన మానవ హక్కుల కార్యకర్త మలాలా

మహిళల, మైనారిటీల , బాలికల రక్షణపై ఆందోళన వ్యక్తం చేసిన మానవ హక్కుల కార్యకర్త మలాలా

అక్కడి మహిళలు, మైనారిటీలు, మానవ హక్కుల కార్యకర్తల విషయమై తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆమె తెలిపారు. ప్రపంచ దేశాలు, స్థానిక సంస్థలు తక్షణమే కాల్పుల విరమణ పిలుపు నివ్వాలని, మానవతా దృక్పథంతో అక్కడున్న వారికి సహాయం అందించాలని మలాలా విజ్ఞప్తిచేశారు . పౌరులు, శరణార్ధులను రక్షించాలని ట్వీట్ చేశారు. తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాజా పరిణామాలు చూస్తే యునైటెడ్ స్టేట్స్, 65 దేశాలతో పాటు ఆఫ్ఘనిస్తాన్ తాజా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి. పునరుజ్జీవన తాలిబన్లను ఆఫ్ఘన్ దేశాన్ని విడిచిపెట్టమని, ఏదైనా దుర్వినియోగానికి బాధ్యత వహించాలని హెచ్చరించింది.

ఆఫ్ఘనిస్థాన్ నుండి వచ్చే అంతర్జాతీయ పౌరులను అనుమతిస్తామన్న ప్రపంచ దేశాలు

ఆఫ్ఘనిస్థాన్ నుండి వచ్చే అంతర్జాతీయ పౌరులను అనుమతిస్తామన్న ప్రపంచ దేశాలు

ఆఫ్ఘనిస్థాన్ నుండి నిష్క్రమించాలనుకునే అంతర్జాతీయ పౌరులు తప్పనిసరిగా అనుమతించబడతారని ధృవీకరిస్తున్నాము అని స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ ట్వీట్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ లో అధికారంలో ఉన్నవారు ప్రస్తుతం అక్కడి వారి రక్షణ బాధ్యత మరియు జవాబుదారీతనం కలిగి ఉంటారు అని ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్ లో చోటుచేసుకున్న సంక్షోభానికి జో బిడెన్ కారణమని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆయనను రాజీనామా చేయాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు.

మా యుద్ధం ముగిసింది, శాంతియుత సంబంధాల కోసం పిలుపునిచ్చిన తాలిబన్లు

మా యుద్ధం ముగిసింది, శాంతియుత సంబంధాల కోసం పిలుపునిచ్చిన తాలిబన్లు

ఆఫ్ఘన్ నాయకులు తాలిబాన్లను కలవడానికి మరియు అధికార బదిలీని నిర్వహించడానికి ఒక సమన్వయ మండలిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఒక ప్రకటనలో జాతీయ సయోధ్య కోసం హై కౌన్సిల్ అధిపతి అబ్దుల్లా అబ్దుల్లా, అలాగే హిజ్-ఇ-ఇస్లామీ నాయకుడు గుల్బుద్దీన్ హెక్‌మత్యార్ మరియు స్వయంగా నాయకత్వం వహిస్తారని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం ముగిసిందని మరియు అంతర్జాతీయ సమాజంతో శాంతియుత సంబంధాల కోసం పిలుపునిచ్చిన తాలిబన్ రాజకీయ కార్యాలయ ప్రతినిధి ఆదివారం ప్రకటించారు.

Recommended Video

    Afghanistan Vice President Trolls Pakistan | Oneindia Telugu
    తాలిబన్ల పాలన అంటే భయపడుతున్న ప్రజలు , యూఎన్ ఏం చేస్తుంది ?

    తాలిబన్ల పాలన అంటే భయపడుతున్న ప్రజలు , యూఎన్ ఏం చేస్తుంది ?

    తాలిబన్ల పరిపాలన ఏ విధంగా సాగుతుంది? ఏ విధమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు అనేది త్వరలోనే స్పష్టమవుతుందని చెప్పారు. ఈ బృందం షరియా చట్టంలోని మహిళలు మరియు మైనారిటీల హక్కులు మరియు భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తుందని నయీమ్ తెలిపారు. అయినాసరే ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పాలన అంటే భయపడుతున్న పరిస్థితిలో మానవ హక్కుల సంక్షోభం నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించాలని మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో యూఎన్ ఏం చేస్తుందో అని ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+