అఫ్గానిస్తాన్: 'మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, మహిళలకూ ప్రాతినిధ్యం' - అబ్బాస్ స్టానిక్‌జాయ్

అఫ్గానిస్తాన్‌లో మూడు రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఖతర్‌లోని అఫ్గాన్ తాలిబాన్ రాజకీయ కార్యాలయంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ తెలిపారు.
బీబీసీ పష్తో రేడియోకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన, "కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో గత 20 ఏళ్ల కాలంలో ప్రభుత్వంలో పని చేసిన వారెవరూ ఉండరు" అని స్టానిక్‌జాయ్ అన్నారు.
ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్ ప్రభుత్వం ఏర్పడుతుందనండలో ఎలాంటి సందేహం లేదని చెప్పిన ఈ నాయకుడు, "దేశంలోని అన్ని ప్రాంతాల వారు ప్రభుత్వంలో ఉంటారు. గత 20 ఏళ్లలో ఏ రూపంలోనైనా అధికారం వ్యవస్థలో పని చేసిన వారెవరికీ ఇకపై స్థానం ఉండదు" అని చెప్పారు.
అంతకుముందు, తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్, ప్రభుత్వ ఏర్పాటు గురించి కాందహార్‌లో తమ నాయకుడు ముల్లా హబీబుల్లా అఖుంద్‌జాదా నాయకత్వంలో మూడు రోజులుగా జరిగిన సమావేశం ముగిసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రబుత్వంలో మహిళలు
తమ ప్రభుత్వంలో మహిళలు కూడా ఉంటారని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన షేర్ ముహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయి, "అయితే, వారిని మంత్రుల స్థాయిలో, కీలక స్థానాల్లోకి తీసుకోవాలా వద్దా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు" అని అన్నారు.
ప్రభుత్వంలో మహిళు అధిక సంఖ్యలో ఉంటారనే విషయంలో ఎలాంటి సందేహం లేదని స్టానిక్‌జాయ్ చెప్పారు. అయితే, కీలక పదవుల్లో ఉంటారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రభుత్వంలో మహిళలు ఉండడం తమకు సమస్య కాదని, వారు అధికార వ్యవస్థల్లో కూడా పని చేస్తారని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్‌లో భారీగా బంగారం, తాలిబాన్ల పాలనలో ఈ నిధి ఎవరికి దక్కనుంది?
- అఫ్గానిస్తాన్: కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్న అమెరికా
- పాకిస్తాన్: గిల్గిట్ నుంచి 32 ఏళ్ల కిందట బయలుదేరిన ఆ విమానం ఏమైంది... ఆ మిస్టరీ ఏంటి?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ల పాలనలో విదేశీ వాణిజ్యం ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుంది?
- అఫ్గాన్ సంక్షోభం: ఐసిస్-కె ఎవరు? ఇది ఎందుకంత హింసాత్మకమైనది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications