పంజ్‌షీర్‌పై మెరుపుదాడికి తాలిబన్లు సన్నద్ధం: ఇంటర్నెట్ బంద్..ఫోన్ కాల్స్ కట్

కాబుల్: సుమారు రెండు దశాబ్దాల పాటు అమెరికా, నాటో బలగాల చేతుల్లో ఒకింత సురక్షితంగా ఉంటూ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల దురాక్రమణలోకి వెళ్లిన తరువాత.. పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. దాడులు, ప్రతిదాడులు మళ్లీ మొదలయ్యాయి. ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోతోన్నారు. ఇప్పటికే జంట పేలుళ్లతో ఆప్ఘనిస్తాన్‌ను వణికింంచారు. అమెరికా సైనికులు సహా 190 మందికి పైగా మృత్యువాత పడ్డారు ఈ దాడుల్లో. దీనికి ప్రతీకారంగా అమెరికా డ్రోన్లతో ప్రతిదాడులకు దిగుతోంది.

దాడికి సమాయాత్తం..

దాడికి సమాయాత్తం..

ఆఫ్ఘనిస్తాన్‌ను పూర్తిగా ఆక్రమించుకున్న తరువాత.. తాలిబన్లు ఎక్కడా గానీ దాడులకు దిగలేదు. అమెరికా చేసిన డ్రోన్ల దాడులకు ప్రతీకారానికి కూడా దిగలేదు. ఈ డ్రోన్ దాడులు ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకున్నవి కావడం వల్ల ఆ అంశాన్ని తాలిబన్లు చూసీచూడనట్టు వ్యవహరిస్తోన్నారు. తమ దృష్టి మొత్తాన్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనే కేంద్రీకరించారు. అలాంటి తాలిబన్లు.. కొత్తగా మరో దాడికి సమాయాత్తమౌతున్నారు.

పంజ్‌‌షీర్‌పై అటాక్..

పంజ్‌‌షీర్‌పై అటాక్..

తమకు కొరుకుడు పడని పంజ్‌షీర్ ప్రావిన్స్‌పై దాడి చేయడానికి తాలిబన్లు సమాయాత్తమౌతోన్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా- ఆ ప్రావిన్స్‌తో బాహ్య ప్రపంచానికి ఉన్న సంబంధాన్ని తెంచేశారు తాలిబన్లు. ఇంటర్నెట్, టెలిఫోన్, సెల్, మెసేజ్ వంటి అన్ని రకాల కనెక్టివిటీని స్తంభింపజేశారు. కమ్యూనికేషన్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆ ప్రావిన్స్‌ను ఆక్రమించుకోవడానికి తాలిబన్లు చేస్తోన్న ప్రయత్నాల్లో భాగంగా కమ్యూనికేషన్ల వ్యవస్థను బంద్ చేసినట్లు సమాచారం.

కమ్యూనికేషన్లు కట్..

కమ్యూనికేషన్లు కట్..

తాలిబన్లు ఆప్ఘనిస్తాన్‌ను పూర్తిగా ఆక్రమించుకున్నప్పటికీ.. పంజ్‌షీర్ ప్రావిన్స్ నుంచి వారికి ప్రతిఘటన ఎదురవుతోంది..ఎదుర‌దెబ్బ తగులుతోంది. తాలిబ‌న్లు ఆఫ్ఘ‌న్‌లోని అన్ని ప్రాంతాల్లోకి ప్ర‌వేశించిన‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కు పంజ్‌షీర్‌ లోయ‌ను మాత్రం త‌మ అధీనంలోకి తెచ్చుకోలేక‌పోతోన్నారు. తమ ప్రయత్నాలను మాత్రం తాలిబన్లు కొనసాగిస్తూనే ఉన్నారు. పంజ్‌షీర్ వ్యాలీపై ముప్పేటదాడి చేయడానికి ప్రిిపేర్ అవుతున్నారు. భారీగా ఆయుధ సంపత్తిని ఆ ప్రావిన్స్ సరిహద్దులకు తరలించారు.

అహ్మద్ మసూద్ అక్కడే..

అహ్మద్ మసూద్ అక్కడే..

తాము పంజ్‌షీర్‌ వ్యాలీలోకి ప్ర‌వేశించినట్లు తాలిబ‌న్లు ప్ర‌క‌టించుకున్నారు. ఈ ప్రకటనపై పలు అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. పంజ్‌షీర్ ఇంకా తాలిబన్ల ఆధీనంలోకి రాలేదని తెలుస్తోంది. ఇప్పటిదాకా తాలిబన్లు ఇక్కడికి రాలేదని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ నాయకుడు అహ్మ‌ద్ మ‌సూద్ తెలిపారు. ఆయన సారథ్యంలోని తిరుగుబాటు సైన్యం పంజ్‌షీర్‌ను తాలిబన్ల చెరలోకి వెళ్లకుండా కాపాడుకుంటోంది. తాలిబన్లు ఎవరూ ఇక్కడ అడుగుపెట్టలేదని మహ్మద్ అల్మాస్ జాహిద్ తెలిపారు.

అమ్రుల్లా సలే యాక్టివ్

అమ్రుల్లా సలే యాక్టివ్

ఆఘ్ఘనిస్తాన్ ఆర్మీ కమాండర్ అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్‌, ఆయనతో పాటు కేర్ టేకర్ అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకున్న మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలే ప్రస్తుతం పంజ్‌షీర్‌లోనే ఉంటోన్నారు. అమ్రుల్లా సలే.. సోషల్ మీడియా వేదికగా తాలిబన్ల దురాగతాలను బయట పెడుతున్నారు. తన అభిప్రాయాలను పంచుకుంటోన్నారు. దీనితో తాలిబన్లు ఆ ప్రావిన్స్‌తో బయటి ప్రపంచానికి ఉన్న సంబంధాలను తెంచేసింది. ఇంటర్నెట్, టెలిఫోన్, సెల్, టెక్స్ట్ మెసేజ్ వంటి కమ్యూనికేషన్లను స్తంభింపజేసింది.

Recommended Video

    Why masood Azhar met Talibans in Afghanistan and why he is celebrating their victory
    రాకపోకలు బంద్..

    రాకపోకలు బంద్..

    దీన్ని పంజ్‌షీర్‌ వ్యాలీని వశం చేసుకోవడానికి తాలిబన్లు విస్తృత ప్రయత్నాలు సాగిస్తోన్నారని, దాడులకు దిగడానికి ఈ ప్రావిన్స్ చుట్టూ మోహరించినట్లు వార్తలు వస్తోన్నాయి. ఇందులో భాగంగా- పంజ్‌షీర్‌లో ఏం జరుగుతోందనే విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా చేసిందని అంటోన్నారు. ఆ ప్రావిన్స్‌కు దారి తీసే మార్గాలన్నింటినీ బ్లాక్ చేసిందని, అక్కడి వారిని రానివ్వకుండా అడ్డుకుంటోన్నారని సమాచారం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+