వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాల్లో కరోనా వైరస్ 20 నిమిషాల్లో 90శాతం క్షీణత.. శాస్త్రవేత్తల అధ్యయనంలో కీలక అంశాలు..

|
Google Oneindia TeluguNews

ప్రపంచ దేశాలలో కరోనా మహమ్మారి విలయతాండం చేస్తోంది. రోజు రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, యూకేలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అమెరికాలో బుధవారం ఒక్కరోజే 8 లక్షలకుపైగా కరోనా బారిన పడ్డారు. భారత్‌లోనూ గడిచిన 24 గంటల్లో 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ గాల్లో ఎంత సేపు దాని ప్రభావం ఉంటుందన్న దానిపై జరిపిన ఓ అధ్యయనంలో ఆసక్తికమైన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గాల్లో కరోనా వైరస్ 20 నిమిషాల్లో 90శాతం క్షీణత

గాల్లో కరోనా వైరస్ 20 నిమిషాల్లో 90శాతం క్షీణత


బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఏరోసోల్ రీసెర్చ్ సెంటర్ జరిపిన ఓ అధ్యయనంలో కరోనా వైరస్ 20 నిమిషాలపాటు గాల్లో ఉంటే దాని సామర్థ్యం దాదాపు 90 శాతం క్షీణిస్తుందని వెల్లడించింది. వైరస్ గాల్లో ఉన్న మొదటి ఐదు నిమిషాల్లోనే అధికశాతం దాని సంక్రమణ శక్తిని కోల్పోతున్నట్లు ఏరోసోల్ రీసెర్చ్ సెంటర్ డైరక్టర్ , ప్రొఫెసర్ జోనాథన్ రీడ్ తెలిపారు. అయితే అధ్యయనాన్ని ఇంకా పూర్తి స్థాయిలో సమీక్షించాల్సి ఉందని పేర్కొన్నారు.

వైరస్ వ్యాప్తికి కారణం..

వైరస్ వ్యాప్తికి కారణం..

గాలి , వెలుతురు సరిగా లేని ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని అందరూ వీటిపై దృష్టి పెడుతున్నారని ప్రొఫెసర్ జోనాథన్ రీడ్ అన్నారు. అయితే అలా జరగదని తాను భావించడం లేదు. కానీ, ప్రజలు దగ్గర దగ్గరగా ఉంటేనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. అందుకే కరోనా వైరస్ కట్టడికి మాస్కులు వాడకం తప్పనిసరి అని శాస్త్రవేత్తలు నొక్కిచెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటిండం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొంటున్నారు.

ఒమిక్రాన్ బాధితులతోనే..

ఒమిక్రాన్ బాధితులతోనే..

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పై దక్షిణాప్రికాలో నిర్వహించిన రెండు పరిశోధనలలో పులు కీలక అంశాలు వెల్లడయ్యాయి. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ లో లక్షణాలు లేని వ్యక్తులు అత్యధికంగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. వీరి వలన వ్యాప్తి మరింత పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించారు. ఉబుంటు, సిసోంకే పేర్లతో ఈ పరిశోధనలు నిర్వహించారు. ఒమిక్రాన్ అమెరికా, బ్రిటన్ , ఫ్రాన్స్ దేశాల్లో కేసులు లక్షల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఆస్పత్రులలో చేరేవారి సంఖ్య పెరిగిపోయింది. రోగులకు వైద్యం అందించేందుకు సిబ్బంది కొరత కూడా అమెరికాను వెంటాడుతుంది.

English summary
How long does the corona virus stay in the air .. How much of its effect in the first 20 minutes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X