గౌతం అదానీ అరెస్టు తప్పదా ? అమెరికా కోర్టు వారెంట్ తర్వాత ఏం జరగనుంది ?

భారత్ లో సౌర ప్రాజెక్టులు పొందేందుకు ప్రభుత్వాలకు భారీ ఎత్తున లంచాలు ఇచ్చిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీతో పాటు ఇతరులపై అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. దీంతో గౌతం అదానీతో పాటు ఏడుగురి అరెస్టు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా కోర్టు నిబంధనల ప్రకారం ఏం చేయబోతోందన్న దానిపై భారత్ లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓసారి న్యాయ ప్రక్రియను పరిశీలిద్దాం.

రాయిటర్స్ నివేదిక ప్రకారం రూ.2029 కోట్ల లంచం, మోసం అభియోగాలు నిర్ధారణ కావడంతో గౌతం అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, ఇతరులపై న్యూయార్క్ కోర్టులో అరెస్టు వారెంట్ జారీ అయింది. అమెరికా న్యాయ శాఖ క్రిమినల్ విభాగం డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్ లిసా హెచ్ మిల్లర్ .. అదానీ, అతని సహచరులు భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చి లాభదాయకమైన సౌరశక్తి సరఫరా ఒప్పందాలను యుఎస్ పెట్టుబడిదారుల ఖర్చుతో అవినీతి , మోసం ద్వారా" పొందేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

after new York court arrest warrant to Gautam adani what will happen next

అమెరికాలో నేరారోపణ అంటే ఏమిటి ?

నేరం మోపబడిన వారిపై అభియోగపత్రం అధికారిక వ్రాతపూర్వక ఆరోపణను నేరారోపణ అంటారు. ఆరోపించిన నేరాన్ని పరిశోధించిన తర్వాత, పోలీసులు సాక్ష్యాధారాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఇస్తారు. ఆరోపణలు రాష్ట్ర లేదా కేంద్ర స్థాయి నేరాలకు సంబంధించినవా అనే దానిపై ఆధారపడి ఆయా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే న్యాయవాది, ప్రాసిక్యూటర్ తీవ్రమైన నేరం లేదా అపరాధం జరిగిందని భావిస్తే గ్రాండ్ జ్యూరీ ఎంపికను ప్రారంభిస్తారు.

గ్రాండ్ జ్యూరీ అంటే ఏమిటి, దాని సభ్యులెవరు ?

గ్రాండ్ జ్యూరీ అనేది కోర్టు పరిధిలో నివసిస్తున్న పౌరుల నుంచి ర్యాండమ్ గా ఎంపిక చేసిన వ్యక్తులతో కూడిన ప్యానెల్. ఇది కేసును విచారించవచ్చు. న్యూయార్క్ రాష్ట్రంలో గరిష్టంగా 23 మంది వ్యక్తులు ఇందులో ఉండొచ్చు. నిందితుల సాక్ష్యం వినడానికి కనీసం 16 మంది జ్యూరీ న్యాయమూర్తులు హాజరు కావాలి. వాస్తవానికి అదానీపై అభియోగాల నమోదు అయిన ఈ దశ చాలా కీలకమైనదిగా చెప్తున్నారు. నేరం చేసినప్పటికీ నిందితుల్ని విచారణకు తీసుకురాలేరు.

గ్రాండ్ జ్యూరీ ఏం చేస్తుంది?:

గ్రాండ్ జ్యూరీ పని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అమాయకత్వం లేదా అపరాధాన్ని నిర్ధారించడం కాదు. ఓ వ్యక్తి సహేతుకమైన సందేహానికి అతీతంగా దోషి అని ట్రయల్ జ్యూరీ నిర్ధారించాలి. అయితే ఒక గ్రాండ్ జ్యూరీ ఇందులో తక్కువ ప్రమాణాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. క్రిమినల్ విచారణ ప్రక్రియకు అదనపు దశగా విచారణ నిర్వహించడానికి అవసరమైన సాక్ష్యం రికార్డులో ఉన్నట్లయితే గ్రాండ్ జ్యూరీ తప్పనిసరిగా దాన్ని నిర్ణయించాలి.

గ్రాండ్ జ్యూరీ సాక్ష్యం సరిపోతుందని భావిస్తే, అది నిందితులపై అధికారిక ఆరోపణల జాబితా విడుదల చేస్తుంది. తర్వాత తుది విచారణ జరిపి నిర్ణయం తీసుకోవడానికి కేసు విచారణకు తీసుకుంటారు. గ్రాండ్ జ్యూరీ విచారణ రహస్యంగా జరుగుతుంది. దీన్ని ప్రజలకు తెలియజేయరు. న్యూయార్క్‌లో కనీసం 12 మంది న్యాయమూర్తులు (సాక్ష్యం విన్న 16 నుండి 23 మందిలో) నేరారోపణను జారీ చేయాలా వద్దా అనే దానిపై నిర్ణయిస్తారు.

తర్వాత ఏం జరుగుతుంది ?

అదానీ కేసులో నేరారోపణ తర్వాత న్యాయమూర్తి అభియోగాలను తెలియజేస్తారు. అలాగే నిందితులకు బెయిల్ మంజూరు చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. ఆరోపణలకు ప్రతిస్పందనగా నిందితులు నేరాన్ని అంగీకరించాలా వద్దా అనేది నిర్ణయించుకుంటారు. వారు తాము నిర్దోషులుగా చెప్తే మాత్రం కేసు జ్యూరీ విచారణకు వెళ్తుంది. ప్రాసిక్యూటర్లు అరెస్టు వారెంట్లను విదేశీ చట్టాల అమలుకు అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+