వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మగ్లింగ్ కేసు: జెడ్జాలో ఎయిర్ ఇండియా ఉద్యోగి అరెస్టు

|
Google Oneindia TeluguNews

న్యూ ఢిల్లీ: అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న ఎయిర్ ఇండియా విమాన సిబ్బందిని సౌదీ అరేబియా రాజధాని జెడ్జాలో అరెస్టు చేశారు. అరెస్టు అయిన ఉద్యోగిని విచారణ చేస్తున్నారని, పూర్తి వివరాలు సేకరిస్తున్నామని ఎయిర్ ఇండియా అధికారులు అంటున్నారు.

కోచ్చి- జెడ్డా నగరానికి ఎయిర్ ఇండియా విమాన సర్వీసు నడిపారు. అందులో 12 మంది ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది ఉన్నారు. గురువారం జెడ్డా అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యాబిన్ క్రూలో ఒక ఉద్యోగిని అక్కడి విమానాశ్రయం అధికారులు అరెస్టు చేశారు.

Air India crew member arrested in Jeddah Airport

అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నారని ఆ ఉద్యోగి మీద కేసు నమోదు చేశారు. తరువాత 11 మంది ఉద్యోగులతోనే ఎయిర్ ఇండియా విమాన సర్వీసు నడిపారు. నిబంధనల ప్రకారం విమానంలో 12 మంది సిబ్బంది ఉంటేనే సర్వీసు నడపాలి.

ఈ విషయంపై శుక్రవారం ఎయిర్ ఇండియా అధికారి ఒకరు న్యూ ఢిల్లీలో స్పందించారు. జెడ్డా విమానాశ్రయం అధికారులు ఎయిర్ ఇండియా ఉద్యోగిని అరెస్టు చేసిన మాట నిజమే అన్నారు. అయితే అరెస్టు గల కారణాలు తెలుసుకుంటున్నామని, నేరం చేశారని తెలిస్తే ఉద్యోగం నుండి తప్పిస్తామని తెలిపారు.

English summary
The detained cabin crew was to board the flight bound for Kochi, along with 11 other crew members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X