ఢిల్లీ బ్రిమ్మింగ్హమ్ విమానాలు రద్దు ... కారణం పాకిస్తానే అట

లండన్ : న్యూఢిల్లీ నుంచి బ్రిటన్‌లోని బ్రిమ్మింగ్హమ్‌కు తిరిగి బ్రిమ్మింగ్హమ్ నుంచి న్యూఢిల్లీకి తమ విమానసర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఎయిర్ ఇండియా. పాకిస్తాన్‌ గగనతలం మూసివేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఎయిర్ ఇండియా.ఇదిలా ఉంటే లండన్‌ హీత్రూ విమానాశ్రయం నుంచి భారత్‌కు వచ్చే సర్వీసులు మాత్రం నడుస్తాయని ప్రకటించింది.

Air India suspends Delhi-Birmingham flights, cites shut Pakistan airspace

పాకిస్తాన్ గగనతలం మూసివేయడంతో ఆ ప్రభావం ఎయిర్ ఇండియా విమానాలపై పడిందని... ఇది ఎయిరిండియా చేతుల్లో లేనందున సర్వీసులన్నిటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు యూకే మరియు యూరప్ రీజియనల్ మేనేజర్ దేబాశిష్ గోల్డర్ . వీటితో పాటు తమ నెట్‌వర్క్ పరిధిలో నడిచే మరికొన్ని విమాన సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత జవాన్లపై దాడి చేసినప్పటి నుంచి పాకిస్తాన్ తమ గగనతలంను మూసివేసింది. ఇదిలా ఉంటే బ్రిమింగ్హమ్ విమానాశ్రయం నుంచి వారానికి మూడు సార్లు ఢిల్లీకి, మరో మూడు సార్లు అమృత్‌సర్‌కు ఎయిర్‌ఇండియా తన సర్వీసులు నడుపుతోంది.

AI113 ఢిల్లీ నుంచి బ్రిమ్మింగ్హమ్, AI114 బ్రిమ్మింగ్హమ్ నుంచి ఢిల్లీకి, AI117ఢిల్లీ నుంచి అమృత్‌సర్-బ్రిమ్మింగ్హమ్ మరియు AI118 బ్రిమ్మింగ్హమ్- అమృత్‌సర్-ఢిల్లీకి వెళ్లే విమాన సర్వీసులను రద్దు కావడంపై బ్రిమ్మింగ్హమ్ విమానాశ్రయం సంస్థ చింతిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ సర్వీసులను పునఃప్రారంభించే దిశగా చర్చలు జరుపుతున్నామని అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ సర్వీసుల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కానీ... తమ టికెట్ డబ్బులను తిరిగి చెల్లించడంగానీ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ విమాన సర్వీసులతో పాటు ఢిల్లీ మాడ్రిడ్, మాడ్రిడ్ ఢిల్లీ విమాన సర్వీసులు కూడా రద్దు అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+