నా తండ్రిని అనొద్దు: ఎయిర్ ఏషియా పైలట్ కూతురు ఏంజిలా

జకర్తా: ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కుప్పకూలి 162 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పైలట్ ఇర్యాంటో కూతురు ఏంజిలా యాంగీ రణస్టియానీస్ టీవీ చానల్స్ ముందుకు వచ్చి స్పందించారు. విమానం కూలిన విషయంలో తన తండ్రిని తప్పుపట్టవద్దని ఆమె కోరారు.

చివరి నిమిషం వరకు ఆయన విమానాన్ని, అందులోని ప్రయాణీకులను కాపాడేందుకు ప్రయత్నించారని చెప్పారు. అసలు ఏ పైలట్ కూడా ప్రయాణీకులకు హానీ కలిగించాలని అనుకోరని చెప్పారు. అలా ఓ పైలట్ వ్యవహరిస్తారంటే తాను అంగీకరించలేనని చెప్పారు.

తన తండ్రి కూడా ఈ ప్రమాదంలో మరణించారని, ఆయన మృతదేహం కూడా ఇప్పటి వరకు లభించలేదన్నారు. ఇప్పటికే తమ కుటుంబం ఆవేదనలో ఉందన్నారు. కాగా, విమానం కూలిన ప్రమాదంలో 162 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

AirAsia flight QZ8501: Daughter of pilot appears on national TV in plea for public not to blame her father

కాగా, ఎయిర్ ఏషియా క్యూజెడ్ 8501 గల్లంతై, సముద్రంలో కూలిందనే విషయం పూర్తిగా తెలియక ముందు కూడా ఆమె మాట్లాడారు. ఆమె ఓ ఎమోషనల్ (ఉద్వేగ) సందేశాన్ని సామాజిక అనుసంధాన వెబ్ సైట్లో పెట్టింది. తన తండ్రికి ఆమె ఆ సందేశం పెట్టింది.

'పాపా, ఇంటికి వస్తాడు. నీ కోసం వేచి చూస్తున్నా' అని పైలట్ కూతురు ఏంజిలా యాంగీ రణస్టియానీస్ సామాజిక అనుసంధాన వెబ్ సైట్లో పెట్టింది. ఆమె వయస్సు 22. 'మా పాపాను తిరిగి పంపించండి. పాపా, ప్లీస్ ఇంటికి రా' అనే సందేశం కూడా ఆమె తన పేజీలో పెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+