వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఏషియా అదృశ్యం: ఇంకా ఎత్తు వెళ్తానని అడిగిన పైలట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఇండోనేషియా: ఇండోనేషియాలోని సూరబాయ నుండి సింగపూర్ వెళ్తున్న క్యూజెడ్8501 ఎయిర్ ఏషియా విమానం ఒకటి అదృశ్యమైన విషయం తెలిసిందే. అది సముద్రంలో కూలినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. జావా సముద్రంలో విమాన శకలాలు లభించినట్లుగా స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, ఈ విమానానివేనా అని నిర్ధారించాల్సి ఉంది.
అయితే ప్రమాదాన్ని ఎయిర్ ఏషియా మాత్రం ధృవీకరించలేదు.

ఇదిలా ఉండగా, ఈ ప్రమాదానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణమని తెలుస్తోంది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో విమానాన్ని మరింత పైకి తీసుకు వెళ్లేందుకు అనుమతించాలని పైలట్ ఏటీసీ అధికారులను కోరినట్లుగా సమాచారం. అయితే ఏటీసీతో పైలట్ మాట్లాడుతుండగానే విమానానికి ఏటీసీతో సంబంధాలు తెగిపాయాయి.

AirAsia flight QZ8501 had asked to fly higher to avoid cloud: Official

వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో 32,000 ఫీట్ ఎత్తు నుండి 38,000 ఎత్తుకు తీసుకు వెళ్లేందుకు పైలట్ కోరినట్లుగా తెలుస్తోంది. అయితే, దాదాపు యాభై వేల ఫీట్ల వరకు క్లౌడ్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, అప్పటికే విమానంతో సంబంధాలు తెగిపోయాయి. విమానం పసిఫిక్ మీదుగా వెళ్తుండగా ఇది జరిగింది.

అదృశ్యమైన విమానంలో మొత్తం 162 మంది ఉన్నారు. అందులో 155 మంది ప్రయాణీకులు. ప్రయాణీకులలో 149 మంది ఇండోనేషియన్లు, ముగ్గురు కొరియన్లు, సింగపూర్, బ్రిటన్, మలేషియాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఏడుగురు క్రూ ఉన్నారు.

English summary
An Indonesia AirAsia flight went missing on Sunday about half way between its origin of Surabaya in Indonesia and its destination of Singapore, an Indonesian transport official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X