వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఎంహెచ్370' తర్వాత ఎయిర్ ఏషియా ప్రకటన, సారీ: శిథిలాలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఇండోనేషియా: 2014 మార్చి 8వ తేదీన ఎంహెచ్ 370 విమానం గల్లంతైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎయిర్ ఏషియా ఓ ప్రకటన చేశారు. ఇప్పుడు అది చర్చనీయాంశమైంది. మార్చిలో ఎంహెచ్ 370 విమానం గల్లంతైంది. ఆ తర్వాత నెలలో అంటే ఆ విమానం గల్లంతైన ఆరు వారాల తర్వాత ఎయిర్ ఏషియా ఓ ప్రకటన చేసింది.

తమ పైలట్ ప్రయాణీకులను సురక్షితంగా తీసుకు వస్తాడని, తమ విమానాల్లో ప్రయాణించే వారు ఎటువంటి భయం చెందవలసిన అవసరం లేదని దాని సారాంశం. ఆ ప్రకటన చేసిన ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలింది.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి. (https://www.facebook.com/oneindiatelugu)

అయితే, అలాంటి సమయంలో ఎయిర్ ఏషియా ప్రకటన పైన విమర్శలు వచ్చాయి. ఎయిర్ ఏషియా కూడా దాని పైన ఆ తర్వాత క్షమాపణలు చెప్పింది. తాము ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నామని ఎయిర్ ఏషియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాతుక్ మెరనన్ ఆ తర్వాత చెప్పారు.

AirAsia

కాగా, సురబయ - సింగపూర్ విమానం క్యూజెడ్ 8501 విమానం జావా సముద్రంలో కూలిపోయినట్లుగా ఇండోనేషియా అధికారులు ధృవీకరించిన విషయం తెలిసిందే. 162 మందితో అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానాన్ని గుర్తించామని ఇండోనేషియా సివిల్ ఏవియేషన్ అధికారులు మంగళవారం ప్రకటించారు.

AirAsia

ఈ ప్రమాదంలో 155 మంది ప్రయాణీకులు, 7గురు సిబ్బంది మృతి చెందారు. ఈ ప్రయాణీకులలో 149 మంది ఇండోనేషియన్లు, ముగ్గురు కొరియన్లు, సింగపూర్, బ్రిటన్, మలేషియా దేశాలకు చెందిన ఒక్కరు చొప్పున ఉన్నారు. కాగా, మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని ఎయిర్ ఏషియా చీఫ్ చెప్పారు.

English summary
AirAsia once boasted in an in-flight article that “Your Captain is well prepared to ensure your plane will never get lost,” the torontosun said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X