మరో దేశ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానం అదృశ్యం

ఇరాన్ దేశాధ్యక్షుడి ఘటన మరువకముందే అలాంటి ఘటనే మరోటి వెలుగుచూసింది. ఆఫ్రికా దేశమైన మలావీ (Malawi) ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలీమా (Saulos Klaus Chilima) ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమైంది. ఆ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది.

మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలీమా తోపాటు మరో తొమ్మిది మందితో ఓ సైనిక విమానం సోమవారం దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు.

.

Aircraft carrying Malawi vice president Saulos Klaus Chilima goes missing reports

ఆ విమానం రాడార్ నుంచి అదృశ్యమైందని, దీంతో విమానయాన అధికారులు కాంటాక్ట్ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించిన అధ్యక్షుడు చక్వేరా.. తన బహామాస్ పర్యటనకు రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది.

కాగా, ఇటీవల ఇరాన్ అధ్యక్షుడ ఇబ్రహీం రైసీ(63) హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో అధ్యక్షుడు రైసీతోపాటు హెలికాప్టర్‌లో ఉన్నవారంతా మరణించారు. ఇంతలోనే మరో దేశ ఉపాధ్యక్షుడు కూడా ఇలాంటి ప్రమాదంలోనే అదృశ్యమవడం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+