వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలోనే పెద్ద విమానం: క్రాష్ ల్యాండింగ్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

బ్రిటన్: ప్రపంచంలోనే అతి పెద్ద విమానం ఎయిర్ ల్యాండర్ -10 క్రాష్ ల్యాండ్ అయ్యింది. బుధవారం బ్రిటన్ లోని బెడ్ ఫోర్ట్ షైర్ ఎయిర్ ఫీల్డ్ లో ల్యాండ్ అయ్యే సమయంలో సమీపంలోని టెలిగ్రాఫ్ స్థంభాన్ని ఢీకొట్టింది.

విమానం సవ్యంగా ల్యాండ్ కాకపోవడంతో కాక్ పీట్ ధ్వంసం అయ్యింది. విమానం చాల నెమ్మదిగా దిగుతున్నందువలన క్రాష్ ల్యాండ్ అయినా పెద్ద నష్టం జరగలేదని అధికారులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

విమానం క్రాష్ ల్యాండ్ అయ్యే సమయంలో భూమి బద్దలైనట్ల అనిపించిందని అన్నారు. ముద్దుగా 'ఫ్లయింగ్ బమ్' అనిపిలుచుకునే ఈ ఎయిర్ ల్యాండర్ 25 మిలియన్ పౌండ్ల (రూ.222 కోట్లు) వ్యయంతో రూపొందించారు.

320 అడుగుల పొడవు ఉన్న ఈ ఎయిర్ ల్యాండర్ -10 గత బుధవారం ఇంగ్లాండ్ లోని కార్టింగ్టన్ లో ఆకాశంలోకి ఎగిరింది. 10 టన్నుల బరువు మోయగల ఈ విమానం బ్రిటన్ సంస్థ హైబ్రిడ్ ఎయిర్ వెహికిల్స్ (హెచ్ఏవీ) రూపొందించింది.

English summary
We will be running through these in the days ahead as we continue the development of the Airlander aircraft.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X