రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు మోడీ మధ్యవర్తిత్వం..! మాస్కోకు అజిత్ దోవల్..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏడాదిగా సాగుతున్న యుద్దం ఆపేందుకు భారత్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మనకు రెండూ సన్నిహిత దేశాలే కావడంతో ఈ యుద్ధాన్ని విరమింపజేసేందుకు ప్రధాని మోడీ ఇప్పటికే ఇరుదేశాల్లోనూ పర్యటించారు. ఇరుదేశాధినేతలు పుతిన్, జెలెన్ స్కీతోనూ భేటీ అయ్యారు. భారత్ విధానాన్ని వారికి వివరిస్తూనే యుద్దం విరమించాల్సిన అవసరాన్ని ఇద్దరికీ గుర్తుచేశారు. దీనిపై వారి నుంచి సానుకూల స్పందన వ్యక్తం కావడంతో మోడీ మరో అస్త్రం ప్రయోగించబోతున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్దం ఆపేందుకు, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు వీలుగా మధ్యవర్తిత్వం నెరపాలని భావిస్తున్న ప్రదాని మోడీ.. తన తురుపుముక్క అయిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ను మాస్కోకు పంపుతున్నారు. ఈ వారంలో మాస్కో బయలుదేరి వెళ్లేందుకు ధోవల్ సిద్ధమవుతున్నారు. రష్యా అధినేత పుతిన్ తో తాజా ఫోన్ కాల్ లో ఈ విషయాన్ని ప్రధాని మోడీ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ధోవల్ ఎప్పుడు వెళ్తున్నారనే వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు.

ప్రధాని మోడీ తాజాగా రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలతో జరిపిన శాంతి చర్చలపై అంతర్జాతీయంగా సానుకూల స్పందన వ్యక్తమైంది. ముఖ్యంగా దౌత్యపరంగా భారత్ వేస్తున్న అడుగులపై చాలా దేశాల నుంచి మంచి స్పందనే వస్తోంది. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను ఇది మరింత పెంచుతుందని కేంద్రం కూడా నమ్ముతోంది. అందుకే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే అంతర్జాతీయీ శాంతిదూతగా భారత్ నిలిచిపోతుందనే అంచనాలున్నాయి.
మరోవైపు ఉక్రెయిన్ వివాదానికి పరిష్కారం కనుగొనడంలో భారతదేశం కీలక పాత్ర పోషించే అవకాశం ఉందనని ఇతర ప్రపంచ నాయకులు కూడా నమ్ముతున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నిన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిపిన చర్చల్లో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. వివాదాన్ని పరిష్కరించడంలో చైనా, భారతదేశం కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఉక్రెయిన్‌ను దాని విధికి వదిలివేయడం ద్వారా వివాదాన్ని పరిష్కరించవచ్చని ఇటలీ కూడా భావిస్తోంది.












Click it and Unblock the Notifications