భారతీయులకు అలర్ట్: సుడాన్‌లో ఖాళీగా ఇండియన్ ఎంబసీ, యూఎన్ చీఫ్‌తో జైశంకర్ చర్చలు
ఖార్తూమ్: సుడాన్‌లో పరిస్థితులు దిగజారుతున్నాయి. సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పులు, బాంబు పేలుళ్లతో సూడాన్ రాజధాని ఖార్తూమ్ సహా పరిసర ప్రాంతాలు కూడా దద్ధరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో సూడాన్‌లోని భారతీయులను మరోసారి భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఎవరూ వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది.
ఖార్తూమ్ విమానాశ్రయ పరిసరాల్లో ఘర్షణలతో కల్లోల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దానికి సమీపంలోనే ఉన్న భారత దౌత్య కార్యాలయంలో ప్రస్తుతం సిబ్బంది ఎవరూ లేరని తెలిపింది. అయితే, రాయబార కార్యాలయం తెరిచే ఉందని.. సిబ్బంది మాత్రం వేర్వేరు చోట్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వివరించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా సురక్షితంగా ఉండాలో సూడాన్‌లోని భారతీయులకు సూచిస్తున్నాం. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. అక్కడి భారత రాయబార కార్యాలయం పనిచేస్తోంది. అయితే, ఆ ప్రాంతంలో తీవ్ర ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో.. ఎవరూ అక్కడికి వెళ్లొద్దని సూచించాం. ప్రస్తుత దౌత్య కార్యాలయంలో సిబ్బంది కూడా ఎవరూ లేరు. వారంతా ఇతర ప్రాంతాల నుంచి సేవలు అందిస్తున్నారని అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు.
భారతీయుల భద్రతే తమ ప్రాధాన్య అంశమని ఆయన స్పస్టం చేశారు. మరోవైపు, సూడాన్‌లో చోటు చేసుకుంటున్న ఘర్షణ వాతావరణంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్‌ను కలిసి చర్చించారు. జైశంకర్ ప్రస్తుతం న్యూయార్క్‌లోనే ఉన్నారు. సూడాన్‌లో శాంతిభద్రతలు నెలకొనేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
#WATCH | We had a very good meeting. Most of our meeting was on the Sudan situation. We also discussed the G20, and Ukraine conflict, but essentially it was about Sudan. In Sudan, the UN is trying to establish a ceasefire and that is really key because at the moment, unless there… https://t.co/6s08TBr3KH pic.twitter.com/hSbg1DKLov
— ANI (@ANI) April 20, 2023
కాగా, సుడాన్‌లోని భారతీయులు దాదాపు 4,000 మంది ఉన్నారు. వీరిలో 1,200 మంది దశాబ్దాల క్రితం అక్కడ స్థిరపడ్డారు. అక్టోబరు 2021లో జరిగిన తిరుగుబాటులో సూడానీస్ మిలటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి దేశాన్ని సార్వభౌమ మండలి ద్వారా నడిపించింది. సూడాన్‌పై నియంత్రణపై ఆ దేశ సైన్యం, శక్తివంతమైన పారామిలటరీ దళం మధ్య సోమవారం వరుసగా మూడో రోజు పోరు కొనసాగింది. ఈ పోరాటంలో గత రెండు రోజుల్లో 200 మందికిపైగా సామాన్యులు చనిపోయారు. అదే సమయంలో, 1,800 మందికిపైగా గాయపడ్డారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications