వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెజాన్‌లో వేలమంది ఉద్యోగుల తొలగింపు..!!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఈ మధ్యకాలంలో కార్పొరేట్ సెక్టార్‌లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. దిగ్గజ కంపెనీలన్నీ ఖర్చు తగ్గించుకునే దిశగా తక్షణ చర్యలను తీసుకుంటోన్నాయి. టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ఇప్పటికే దీనికి శ్రీకారం చుట్టాయి. ఇక ప్రఖ్యాత ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ కూడా అదే బాటలో నడవబోతోంది. వేలాదిమంది ఉద్యోగులను తొలగించడానికి సమాయాత్తమౌతోంది.

ట్విట్టర్‌తో..

ట్విట్టర్‌తో..

టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్.. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత అందులో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఆరంభమైన విషయం తెలిసిందే. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ సైతం దీనికి మినహాయింపు కాదు. పరాగ్ అగర్వాల్‌, విజయా గద్దె వంటి టాప్ అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌పై వేటు పడింది. అక్కడితో ఈ తొలగింపు ప్రక్రియకు పుల్‌స్టాప్ పడలేదు. మేనేజర్ స్థాయిలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి.

ఫేస్‌బుక్‌లోనూ..

ఫేస్‌బుక్‌లోనూ..


మేనేజర్ క్యాడర్ నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకూ తొలగింపు బారిన పడ్డారు. తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీని తరువాత సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కూడా అదే ప్రక్రియను చేపట్టింది. ఉద్యోగులను తొలగించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలో 13 శాతం వరకు ఉద్యోగాలను కుదించే చర్యలు ఆరంభం అయ్యాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే మెయిల్ చేశారు. మెటాలో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో చాలామంది భారతీయులు ఉన్నారు.

 హెచ్1 బీ విసాదారులపై..

హెచ్1 బీ విసాదారులపై..

వారందరూ హెచ్1 బీ విసాల మీద పనిచేస్తోన్న వారే. నిబంధనల ప్రకారం 60 రోజులలో వాళ్లు ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది. ఎవరైనా హెచ్1 బీ వీసా హోల్డర్‌కు 60 రోజుల్లో కొత్త ఉద్యోగం దొరక్కపోతే, వారంతా స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందులు కార్పొరేట్ సెగ్మెంట్‌లో ఏర్పడ్డాయి.

అమెజాన్ కూడా..

అమెజాన్ కూడా..

ఈ పరిణామాల మధ్య- తాజాగా అమెజాన్ కూడా ఉద్యోగుల తొలగింపు చర్యలకు శ్రీకారం చుట్టింది. వచ్చే వారం రోజుల వ్యవధిలో 10,000 మందిని తొలగించే అవకాశం ఉంది. నష్టాలు వస్తోన్నందున ఖర్చు తగ్గించడానికి అమెజాన్ యాజమాన్యం ప్రాధాన్యత ఇస్తోందని, ఇందులో భాగంగానే ఉద్యోగులను తొలగించనుందని ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌కు 1.6 మిలియన్ల మంది ఉద్యోగులు ఉన్నారని పేర్కొంది.

తగ్గిన అమ్మకాలు..

తగ్గిన అమ్మకాలు..

రిటైల్, మానవ వనరులు, అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ విభాగం..ఇలా అన్ని డిపార్ట్‌మెంట్లల్లోనూ ఉద్యోగాల్లో కోతలు ఉండొచ్చని అంచనా వేస్తోన్నట్లు తెలిపింది. దీనికి కారణాలు లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా కొనుగోళ్లు తగ్గడం, ఆర్థికమాంద్య సూచనలు, అంచనాలకు అనుగుణంగా రాబడి లేకపోవడం వంటి కారణాల వల్లే అమెజాన్ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకుందని మరో మీడయా ది వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

English summary
Amazon is planning to lay off thousands of employees and implement cost-cutting measures as the last few quarters haven't been profitable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X