America: అప్పుల ఊబిలో అగ్రరాజ్యం.. ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం, డాలర్‌కు ముప్పు!

America: అమెరికాపై అప్పుల భారం ఏటా వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు అమెరికా జాతీయ అప్పు 37 ట్రిలియన్ డాలర్లను దాటింది. ఇది అమెరికాలో ఆందోళన కలిగిస్తోంది. కేవలం వడ్డే చెల్లింపులకే ఏటా ఒక ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చవుతోంది. ఇదే విధంగా అప్పులు పెరుగుతూ పోతే అమెరికా బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడి, ఆ దేశ ఆర్థిక వృద్ధి నిలిచిపోవచ్చని చెబుతున్నారు. జూన్ 20 నాటి అమెరికా ప్రభుత్వంపై ఉన్న అప్పు దేశ ఆర్థిక వ్యవస్థ ఏడాదిలో పెరిగే మొత్తం కంటే ఎక్కువ. కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనా ప్రకారం.. పెద్ద సంస్కరణలు లేకుండా 2055 నాటికి అప్పు జీడీపీలో 156 శాతానికి పెరుగుతుంది. ప్రస్తుత స్థాయిలో పెరుగుతున్న ఖర్చులు , స్థిరమైన వృద్ధి కారణంగా ఏటా 2 ట్రిలియన్ డాలర్ల లోటు అప్పుల పెరుగుదలకు దారితీస్తోంది.

అమెరికాకు తాజా ముప్పు ఏమిటి?
అమెరికాకు అతిపెద్ద, తాజా ముప్పు వడ్డీ చెల్లింపుల రూపంలో ఉంది. మొత్తం ట్యాక్సుల ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు నాలుగింట ఒక వంతు ఇప్పుడు అప్పులు తీర్చడానికే ఖర్చవుతోంది. దీని అర్థం సామాజిక భద్రత, మెడికేర్, జాతీయ రక్షణ, మౌలిక సదుపాయాల కోసం చాలా తక్కువ డబ్బు మిగులుతుంది. ఈ రంగాలు లక్షలాది మంది అమెరికన్లకు చాలా కీలకంగా ఉన్నాయి.

America Drowning in Debt Over 37 Trillion Major Impact on Economy and Dollar at Risk

అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా సంక్షోభం ప్రభావం
ముప్పు కేవలం బడ్జెట్ కోతలకు మాత్రమే పరిమితం కాదు. ఈ అప్పు ప్రైవేట్ పెట్టుబడులను తగ్గించగలదని, రుణ్ ఖర్చులను పెంచగలదని, ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగించగలదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అప్పుల భారం నియంత్రించబడకపోతే రాబోయే దశాబ్ధంలో జీడీపీ 340 బిలియన్ల నష్టం సంభవించవచ్చని సీబీవో అంచనా వేస్తోంది. ఇది 1.2 మిలియన్ల ఉద్యోగాలను కోల్పోవడానికి, అన్ని రంగాలలో వేతన పెరుగుదల మందగించడానికి దారితీయవచ్చు.

డాలర్ విలువ పడిపోవచ్చు..
వడ్డీ రేట్ల పెరుగుదల నష్టాన్ని మరింత పెంచుతోంది. ప్రపంచ రుణదాతలు అమెరికా లోటుకు నిధులు సమకూర్చడానికి అధిక రాబడిని కోరడం ప్రారంభించడంతో అందరికీ రుణ ఖర్చులు పెరుగుతున్నాయి. ద్రవ్య సంక్షోభం మరింత తీవ్రంగా మారుతోంది. మరోవైపు ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సామర్థ్యంపై పెట్టుబడిదారుల నమ్మకం కోల్పోతే.. వడ్డీ రేట్లలో తీవ్ర పెరుగుదల లేదా డాలర్ విలువలో పతనం సంభవించవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా నష్టాన్ని కలిగించవచ్చు.

అయినా పెరుగుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ
అప్పుల సంక్షోభం పెరుగుతున్నప్పటికీ అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ పెరుగుతోంది. కానీ దాని వేగం చాలా మందగించింది. ఈ ఏడాది జీడీపీ వృద్ధి అంచనా కేవలం 1.4 నుంచి 1.6 శాతంగా ఉంది. నిరుద్యోగం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే ఎక్కువగా ఉంది. ఆర్థికవేత్తలు, వ్యాపార విశ్లేషకుల హెచ్చరికలు, ఎలన్ మస్క్ వంటి వారి వ్యాఖ్యలు ఇప్పుడు నిజమని అనిపిస్తున్నాయి. అమెరికా ఇదే మార్గంలో వెళ్తే.. రాబోయే తరాలు మాత్రమే కాదు.. చాలా ముందుగానే దీని పర్యవసానాలను అనుభవించాల్సి రావచ్చు.

భారత్ ఎంత అప్పు ఇచ్చిందంటే?
గతేడాది జూన్‌లో భారత్ వద్ద 241.9 బిలియన్ల డాలర్లు(సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు) విలువైన అమెరికన్ ట్రెజరీ ఈక్విటీలు ఉన్నాయి. దీంతో భారత్ 12వ అతిపెద్ద విదేశీ రుణదాతంగా నిలిచింది. దీనిని ఇలా కూడా చెప్పవచ్చు. భారత్ అమెరికా ట్రెజరీ బాండ్‌ల ద్వారా దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల అప్పు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+