వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యెమెన్ పై మిసైల్ దాడులు చేసిన అమెరికా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఆత్మ రక్షణ కోసం తాము యెమెన్ మీద మిసైల్ దాడులు చేశామని అమెరికా రక్షణ శాఖ అధికారులు అంటున్నారు. యెమెన్ లోని రాడార్ నిర్వహణా కేంద్రాలను అమెరికా లక్షంగా చేసుకుంది.

తరువాత ఎర్ర సముద్రంలో లంగరు వేసిన అమెరికా యుద్ధ నౌకలు యెమెన్ లోని రాడార్ నిర్వహణా కేంద్రాలను లక్షంగా చేసుకుని అమెరికా మిలటరీ మిసైల్ దాడులు చేసింది. మూడు రాడార్ నిర్వహణ కేంద్రాలు ధ్వంసం అయ్యాయని అమెరికా స్వయంగా అంగీకరించింది.

ఇటీవల అమెరికా యుద్ద నౌక యూఎస్ఎస్ మాసన్ మీద యెమెన్ నుంచి వచ్చిన రెండు క్షిపణలు పడ్డాయి. అయితే అవి యుద్ధ నౌకకు తగల కుండా సముద్రంలో పడిపోయాయి. అలాగే బుధవారం సైతం యుద్ధ నౌక మీద క్షిపణి దాడులు జరిగాయి.

America military strikes Yemen after missile attacks on US Navy ship

ఆత్మరక్షణ కోసం తాము యెమెన్ మీద దాడి చేయవలసి వచ్చిందని అమెరికా స్పష్టం చేసింది. యెమెన్ రాజధాని సానా తో సహ మైనారిటీ షియో హౌథీ నియంత్రణలోని భూభాగంపై దాడులు చేశామని అమెరికా ప్రకటించింది.

గత ఆదివారం కేవలం గంట సమయంలోనే యెమెన్ నుంచి రెండు క్షిపణలు వెంటవెంటనే వచ్చి యుద్ధ నౌక దగ్గర పడ్డాయని అమెరికా చెప్పింది. యూఎస్ఎస్ మాసన్ కు ఎలాంటి హాని జరగకుండా చూడటానికి తాము దాడులు చేశామని అమెరికా వివరించింది.

ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ నౌన అనేక సంవత్సరాల నుంచి తిష్ట వేసి ఉన్న విషయం తెలిసిందే. గత సంవత్సరం నుంచి సౌదీ అరేబియా నుంచి యెమెన్ వినాశకర యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. సౌదీ అరేబియా అమెరికా సరఫరా చేసిన ఆయుధాలను వాడుకుంటోంది. యెమెన్ కు అమెరికా యుద్ధ నౌకను టార్గెట్ చేసే ధైర్యం ఉందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
The USS Mason was targeted late Wednesday by missiles from territory controlled by the Houthis a minority Shia group that has taken control of swathes of Yemen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X