వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ తో పోరు: మూడో ప్రపంచ యుద్ధం కాదు, ఒబామా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులపై పోరాటం మూడో ప్రపంచ యుద్ధం కాదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ప్రపంచంలో అమెరికానే అత్యంత శక్తివంతమైన దేశమని ఒబామా చెప్పారు.

అమెరికా అధ్యక్షుడిగా పదవీకాలం పూర్తికాబోతున్న నేపధ్యంలో బరాక్ ఒబామా చివరిసారి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్తు గురించి ఆందోళన వద్దని భరోసా ఇచ్చారు. విద్య, భద్రత, ఆర్థికాభివృద్ది, ఆరోగ్యం, స్వేచ్చ, రాజకీయాలు, ఉగ్రవాదులపై చర్యలు తదితర అంశాలపై ప్రసంగించారు.

దేశంలో పెరిగిపోతున్న తుపాకి హింస నుంచి మన పిల్లలను రక్షించుకుందామని అమెరికన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి అమెరికన్ ఉన్నత విద్య అభ్యసించేలా కాలేజీలను అందుబాటులో ఉంచాలని అన్నారు. ఇతర అంశాలపై ఒబామా ఈ విధంగా ప్రసంగించారు.

ఏ విషయం విస్మరించరాదు

ఏ విషయం విస్మరించరాదు

ఆరోగ్యం, సామాజిక భద్రత, ముఖ్యంగా అన్ని విషయాలను విస్మరించకుండా అమలు చెయ్యాలని ఒబామా అన్నారు.

పిల్లల కోసం

పిల్లల కోసం

మన పిల్లల కోసం మరింత మంది ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను నియమించి వారికి పూర్తి మద్దతు ఇవ్వాలని ఒబామా చెప్పారు.

ప్రేమించే హక్కు ఉంది

ప్రేమించే హక్కు ఉంది

దేశంలో ప్రతి ఒక్కరికీ తాను ప్రేమించినవారిని పెళ్లి చేసుకునే స్వేచ్చ ఇవ్వాలని బరాక్ ఒబామా మనవి చేశారు.

ప్రజలు లక్ష్యం కాకూడదు

ప్రజలు లక్ష్యం కాకూడదు

ప్రజలను లక్ష్యంగా చేసుకునే రాజకీయాలను ప్రతి ఒక్కరూ తిరస్కరించాలని ఒబామా సూచించారు.

మీతోనే ఉంటాను

మీతోనే ఉంటాను

పదవి నుంచి వైదొలిగినా మరో ఐదు, పదేళ్ల పాటు మీతోనే ఉంటూ మన భవిష్యత్తుపై దృష్టిపెడతానని ఒబామా అన్నారు.

ఆర్థికాభివృద్ది లక్ష్యంగా పని చేశా

ఆర్థికాభివృద్ది లక్ష్యంగా పని చేశా

గత ఏడేళ్లుగా అర్థికాభివృద్దిని సాధించాలనే లక్ష్యం తో పనిచేశాం, ఇది సత్పలితాలను ఇచ్చిందని ఒబామా వివరించారు.

నాపై సందేహం ఉంటే లాడెన్ ను అడగండి

నాపై సందేహం ఉంటే లాడెన్ ను అడగండి

అమెరికాపై చిత్తశుద్దికానీ నాపై సందేహం ఉంటే, న్యాయం జరిగిందని నేనూ చెబుతున్నా, కావాలంటే బిన్ లాడెన్ ను అడిగిచూడండి అని ఒబామా అన్నారు.

అమెరికన్ల రక్షణకు ప్రధాన్యం

అమెరికన్ల రక్షణకు ప్రధాన్యం

అమెరికన్ల రక్షణకే తాము మొదటి ప్రాధాన్యం ఇచ్చాం, తరువాత లక్షం ఉగ్రవాదం, అమెరికా అస్తిత్వానికి ఇస్లామిక్ స్టేట్ ప్రమాదకరం కాదని ఒబామా వివరించారు.

ప్రశంసలు

ప్రశంసలు

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగం పూర్తి అయిన తరువాత ఆయన సహచరులు ఒబామాను అభినందిచారు.

English summary
We need to reject any politics that targets people because of race or religion, Obama said in his State of the Union Address.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X